తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటి వెలుగొందుతోంది. అటు కలెక్షన్ల పరంగానే కాకుండా కంటెంట్ పరంగా కూడా తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం దక్కుతోంది. ఇరాన్ ఇటీవల భగవంత్ కేసరిలో బాలకృష్ణ యాక్షన్ క్లిప్ తో అమెరికాకు కౌంటర్ ఇచ్చిన సంగతి ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉండగా…తాజాగా భారీ తెలుగు సినిమాగా తెలుగు చిత్ర ఖ్యాతిని పెంచిన బాహుబలి క్లిప్ తో మరోసారి అమెరికాకు కౌంటర్ ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇరాన్, అమెరికాకు కౌంటర్ ఇచ్చే క్రమంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘భాగవత్ కేసరి’ సినిమాలోని పవర్ ఫుల్ యాక్షన్ క్లిప్‌ను ఉపయోగాంచిన సంగతి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. తాజాగా హైదరాబాద్ లోని ఇరాన్ రాయబార కార్యాలయం ప్రభాస్ నటించిన ఈ సూపర్ హిట్ చిత్రం ‘బాహుబలి’ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసింది. మేం ఎవ్వరికీ తలవంచబోమని మా అధ్యక్షుడు పెజెష్కియాన్ యునైటెడ్ నేషన్స్ సమావేశంలో స్పష్టంగా చెప్పారు. కాలకేయులకు ఎదురొడ్డి బాహుబలి పోరాడినట్లే, మేం కూడా మా మాతృదేశం కోసం రక్తం చిందించి ప్రాణత్యాగానికైనా సిద్ధపడతామని ఇరాన్ ఎంబసీ పేర్కొంది. మొత్తానికి కంటెంట్ లో గ్లోబల్ రీచ్ తో తెలుగు సినిమా ఈ రకంగా కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
విదేశీ వేదికలపై తెలుగు సినిమాల గురించి చర్చ జరగడం, అంతర్జాతీయ స్థాయిలో మన కథలు ఏస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి అనేది ఇటువంటి ఘటనలతో తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం (కాన్సులేట్ జనరల్) రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ ఆల్ టైమ్ సూపర్‌హిట్ చిత్రం ‘బాహుబలి’లోని ఒక పవర్ ఫుల్ వీడియో క్లిప్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం ఈ పోస్ట్ క్షణాల్లోనే నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్ట్‌కు జోడించిన సందేశంలో ఇరాన్ దౌత్య కార్యాలయం కీలక విషయాలను ప్రస్తావించింది. ఐక్యరాజ్యసమితి (UN) సాధారణ సమావేశాల వేదికగా తమ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, తాము ప్రపంచంలో ఏ దేశానికి లేదా శక్టికీ తలవంచేది లేదని స్పష్టం చేసినట్లు పేర్కొంది. సినిమాలో కాలకేయుల క్రూరమైన మూకలను ఎదుర్కొంటూ, వారి ఆక్రమణకు వ్యతిరేకంగా నరేంద్ర బాహుబలి ధైర్యంగా పోరాడినట్లే తమ దేశం కూడా శత్రువులకు ఎదురొడ్డి నిలుస్తుందని ఇరాన్ ఎంబసీ వ్యాఖ్యానించింది. బాహుబలి వీరత్వాన్ని తమ దేశ సైనిక స్ఫూర్తితో పోల్చడం నిజంగా మన సినిమా ఏస్థాయిలో ఎమోషన్స్ ను బలంగా తీసుకువెళ్లిందో చెబుతోంది. మాతృదేశ రక్షణ కోసం తమ రక్తం చిందించడానికైనా, ప్రాణత్యాగానికైనా వెనుకాడేది లేదని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. మొత్తానికి ఎంటర్టైన్మెంట్ అందించడమే కాకుండా, ప్రపంచంలోని ప్రతిమూలకు రీచ్ అయ్యే కంటెంట్ తో అంతర్జాతీయ వేదికలపై మాధ్యమంగా మారడం తెలుగు సినిమాకు దక్కుతున్న గౌరవంగా ప్రేక్షకులు పేర్కొంటున్నారు. ప్రపంచ శక్తివంతమైన దేశాలకు తమ నిరసనను, బలాన్ని తెలిపేందుకు కూడా తెలుగు చిత్రాల కంటెంట్ ను ఉపయోగించుకోవడం మన సినిమా ప్రభావం ప్రపంచంపై ఎలా ఉందో అనే దానికి బలమైన నిదర్శనం.