ఆర్య 3 ఫిక్స్. ఇంతకీ.. ఎవరితో..?

Spread the love

ప్రేమలో కొత్త కోణాన్ని.. ప్రేమకథా చిత్రాల్లో వైవిధ్యాన్ని చూపించిన సినిమా ఆర్య. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు క్లాసిక్ గా నిలిచింది. అయితే.. ఈ సినిమా ఇరవై ఏళ్లు అయిన సందర్భంగా ఆమధ్య ఈ మూవీ టీమ్ మీడియా మీట్ ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆర్య 3 మూవీ ప్లానింగ్ జరుగుతున్నట్టుగా తెలిసింది. ఇంతకీ.. ఆర్య 3 లో నటించేది అల్లు అర్జునేనా..? లేక వేరే హీరోతో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారా..?

ఆర్య 3 మూవీ ఇప్పుడు వార్తల్లోకి రావడానికి కారణం ఏంటంటే.. దిల్ రాజు ఈ మూవీ టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట. ఈ వార్త లీకైంది. ఇక అప్పటి నుంచి ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ చేయించింది ఎవరి కోసం అనేది అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. ఆర్య రిలీజై 20 ఏళ్లు అయిన సందర్భంగా మూవీ టీమ్ అంతా కలిసినప్పుడు ఆర్య 3 చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అయితే.. అప్పుడు బన్నీ ఇమేజ్ వేరు.. ఇప్పుడు బన్నీ ఇమేజ్ వేరు. అందుచేత ఇప్పుడు ఆర్య 3 చేయడం కుదరదేమో అనే టాక్ వినిపించింది.

అల్లు అర్జున్ కోసం కాకపోతే మరి దిల్ రాజు ఇప్పుడు ఈ టైటిల్ రిజిస్టర్ చేయించడానికి కారణం ఏంటంటే.. యంగ్ హీరో ఆశిష్ కోస రిజిస్టర్ చేయించి ఉంటారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆశీష్ రౌడీ బాయ్స్, లవ్ మీ అంటూ సినిమాలు చేశాడు కానీ.. ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. భారీ విజయం అందించి ఆశీష్ ని హీరోగా నిలబెట్టాలని దిల్ రాజు చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఆశీష్ కనుక ఆర్య 3 అనే టైటిల్ తో సినిమా చేస్తే.. యూత్ లో ఖచ్చితంగా క్రేజ్ ఏర్పడుతుంది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఆశీష్ కోసం ఆర్య 3 టైటిల్ రిజిష్టర్ చేయించారా..? లేక బన్నీ కోసమే రిజిస్టర్ చేయించారా..? లేక వేరే ప్లాన్ ఏదైనా ఉందా..? దిల్ రాజు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.