వాట్సాప్ ద్వారా మోసం.. జాగ్రత్త?!

Spread the love

స్కామర్లు రోజురోజుకీ కొత్త స్ట్రాటజీస్ తో జనాల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా ఉపయోగించే వాట్సప్‌ మీద ఫోకస్ పెట్టారు. స్టెగనోగ్రఫీ అంటూ కొత్త టెక్నాలజీతో మోసానికి పాల్పడుతున్నారు. దీనివల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం:

స్టెగనోగ్రఫీ అంటే ‘రహస్య లిపి’ అని అర్థం. ఇందులో ఇమేజ్, ఆడియో వంటి మీడియా ఫైళ్లలో రహస్య సమాచారాన్ని ఇంక్లూడ్ చేసి, లీస్ట్‌ సిగ్నిఫికెంట్‌ బిట్‌ (ఎల్‌ఎస్‌బీ) పద్ధతిని వాడతారు. హానికరం కానీ మీడియా ఫైళ్లలో మాల్వేర్స్, రహస్య సూచనలను నిక్షిప్తం చేయటం ద్వారా ఇలాంటి మోసాలు ఈజీగా జరుగుతున్నాయి. చాలా ఇమేజ్‌ల్లో ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగులకు సంబంధించి మూడు బైట్ల సమాచారం ఉంటుంది. మాల్వేర్‌ వీటిల్లో ఒకదాంట్లోనో, ఆల్ఫా ఛానల్‌ అనే నాలుగో బైట్‌లోనో దాగుంటుంది. స్టెగనోగ్రఫీతో కూడిన ఇమేజ్‌ను ఓపెన్‌ చేయగానే, చడీచప్పుడు లేకుండా మాల్వేర్‌ బ్యాకప్ లో ఇన్‌స్టాల్‌ అవుతుంది. మీకు సంబంధించిన పర్సనల్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇది కొల్లగొడుతుంది. ఇలా బ్యాంకు ఖాతా, క్రెడిట్, డెబిట్‌ కార్డు, పిన్‌ నంబరు వంటివి సంగ్రహిస్తారు. లాగిన్‌ పేజీలు, అదనపు లింక్ లు, పిన్‌ నంబరు చెప్పటం వంటివేవీ లేకుండానే మోసం జరిగిపోతుంది. జరిగిందని గ్రహించేలోపే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది.

  • కాబట్టి ఎప్పుడు కూడా తెలియని నంబర్ల నుంచి వచ్చిన ఫైళ్లను ఓపెన్ చేయడం లేదా డౌన్‌లోడ్‌ చేయవద్దు.
  • ఎప్పటికప్పుడు ఫోన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. దీంతో ఏవైనా డిఫాల్ట్స్ ఉంటే పోతాయి.
  • ఫొటోలు వాటంతటవే డౌన్‌లోడ్‌ కాకుండా వాట్సప్‌ సెటింగ్స్‌లోకి వెళ్లి ఆటో డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ను డిసేబుల్‌ చేసుకోవాలి.
  • మోసగాళ్లు తెలిసినవాళ్లలానే ప్రవర్తిస్తారు. కాబట్టి ఓటీపీ నంబర్లను అసలు షేర్‌ చేయొద్దు.
  • అనవసర, అనుమతి ఇవ్వకుండా చేరిన గ్రూపుల్లోనుంచి ఎక్సిట్ అవ్వాలి. తిరిగి మళ్ళీ మనల్ని చేర్చకుండా గ్రూప్‌ అనుమతులను ‘మై కాంటాక్ట్స్‌’కే పరిమితం చేసుకోవాలి.
  • స్పామ్, స్కామ్‌ ప్రయత్నాల నివారణకు ‘సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్స్‌’ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవడం మంచిది.