
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ ది రాజాసాబ్. ఇది హర్రర్ ఎంటర్ టైనర్. డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్ టైమ్ హర్రర్ మూవీ చేయడం.. ఈ మూవీ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో రాజాసాబ్ పై మరింతగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అయితే.. ఏప్రిల్ 10న ది రాజాసాబ్ మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు కానీ.. ఆతర్వాత పోస్ట్ పోన్ చేశారు. ఇంత వరకు రాజాసాబ్ రిలీజ్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ కోసం నాలుగు డేట్స్ లాక్ చేశారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ లీక్. ఇంతకీ.. ఆ నాలుగు డేట్స్ ఏంటి..? రాజాసాబ్ వచ్చేది ఎప్పుడు..?
ఈ మూవీలో ప్రభాస్ పలికే డైలాగ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయట. అందుకనే డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారట. తెలుగు వెర్షెన్ వరకు ఓకే కానీ.. మిగిలిన భాషల డబ్బింగ్ విషయంలో మరింత శ్రద్ధ చూపిస్తున్నారని తెలిసింది. ఎందుకంటే.. డైలాగ్స్ లోనే ఎక్కువ ఫన్ ఉండేలా మారుతి రాసారట. ప్రభాస్ ఈ స్టైల్ లో డైలాగ్స్ చెప్పడం ఇదే ఫస్ట్ టైమ్ అని.. ఆడియన్స్ కి కొత్త తరహా ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించింది.
ఇక రిలీజ్ డేట్స్ విషయానికి వస్తే.. సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరిలో ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందా అని మేకర్స్ సీరియస్ గా ఆలోచిస్తున్నారట. ముఖ్యంగా పుష్ప రిలీజ్ డేట్ అయిన డిసెంబర్ 5న ది రాజాసాబ్ ని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందా అని డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటున్నారట. డిసెంబర్ 5న కుదరకపోతే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్, అక్టోబర్ డేట్ లు సౌత్ కి, నార్త్ కి మ్యాచ్ కావడం లేదట. అందుచేత డిసెంబర్ 5 లేదా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫైనల్ చేశారట. ఫైనల్ గా రాజాసాబ్ ఎప్పుడు రావచ్చంటే.. డిసెంబర్ 5న ఫైనల్ కావచ్చనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ లీక్. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ డేట్ నే లాక్ చేసి అనౌన్స్ చేస్తారేమో చూడాలి.