విలన్ క్యారెక్టర్ కు నాగ్ ఓకే చెబుతారా..?

Spread the love

టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఇప్పటి వరకు ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ అందించారు. అలాగే ఫ్లాప్స్ కూడా చూశారు. అయితే.. దాదాపు నాలుగు దశబ్ధాలుగా హీరోగా నటించి అలరించిన నాగార్జున ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పటి వరకు హీరోగా ఆకట్టుకున్న నాగ్ విలన్ గా నటించేందుకు ఓకే చెబుతాడా..? అనేది ఇండస్ట్రీ జనాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. ఏ సినిమాలో నాగ్ కు విలన్ రోల్ ఆఫర్ చేశారు..? నాగ్ ఏం చేయబోతున్నాడు..?

విక్రమ్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇంత వరకు విలన్ గా నటించలేదు. నా సామి రంగ తర్వాత నాగార్జున సోలో హీరోగా కొత్త సినిమాను ప్రకటించలేదు. కోలీవుడ్ స్టార్ ధనుష్‌ తో కలిసి నాగార్జున కుబేర సినిమాలో నటించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ విభిన్న కథా చిత్రాన్ని జూన్ 20న రిలీజ్ చేస్తున్నారు. ఇందులో నాగ్ కీలక పాత్ర పోషించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలో కూడా నాగ్ కీలక పాత్ర పోషించడం విశేషం. అయితే.. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడని ప్రచారం జరిగింది కానీ.. మేకర్స్ నుంచి క్లారిటీ లేదు. కాకపోతే.. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఈ పాత్రను డిజైన్ చేశారని సమాచారం.

ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 మూవీలో నాగార్జునకు విలన్ క్యారెక్టర్ ఆఫర్ చేశారట. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఇటీవల నాగ్ ను కలిసి కథ చెప్పారట. అయితే.. కథ.. అందులో విలన్ క్యారెక్టర్ గురించి విన్న నాగ్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదట. నాగ్ ఇప్పుడు సోలో హీరోగా భారీ, క్రేజీ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. దీని కోసం గత కొన్ని రోజులుగా నాగార్జున కథలు వింటూనే ఉన్నాడు. ఇంత వరకు కొత్త సినిమా గురించి అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు విలన్ క్యారెక్టర్ రావడం.. అది కూడా రజినీ మూవీలో రావడం విశేషం. విలన్ క్యారెక్టర్ చేస్తే.. కెరీర్ ఇక ఎండ్ కి వచ్చినట్టే అనే టాక్ రావడం ఖాయం. మరి.. నాగ్ విలన్ క్యారెక్టర్ చేయడం విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.