
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంబరాల ఏటి గట్టు. ఈ సినిమా గ్లింప్స్ ను ఆమధ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ సినిమాని తేజ్ మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి నిర్మిస్తుండడం విశేషం. అది కూడా కొత్త దర్శకుడు పై నమ్మకంతో ఇంత బడ్జెట్ పెట్టడం రిస్కే అనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు పవర్ స్టార్ ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఇదే డేట్ కి సంబరాల ఏటిగట్టు రావాలి అనుకుంది. మరి.. ఓజీ వస్తే.. తేజ్ వస్తాడా..? అసలు తేజ్ సంబరాల ఏటిగట్టు అప్ డేట్ ఏంటి..?
సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు మూవీని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే ప్లానింగ్ చేసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీని ఇదే డేట్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఓజీ మూవీకి పోటీగా తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాను రిలీజ్ చేస్తారా..? లేక పోస్ట్ పోన్ చేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. తనకు ఎంతో ఇష్టమైన మావయ్య సినిమా వస్తుంటే.. తేజ్ ఎందుకు తన సినిమాను విడుదల చేస్తాడు. ఖచ్చితంగా ఓజీ వస్తే.. తేజ్ మూవీ రాదని చెప్పచ్చు.
ఇంతకీ సంబరాల ఏటిగట్టు అప్ డేట్ ఏంటంటే.. ప్రస్తుతం ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 120 రోజులు షూటింగ్ పూర్తయ్యిందని.. ఓవరాల్ గా డబ్బై ఐదు శాతం కంప్లీట్ అయ్యిందని తెలిసింది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం భారీ సెట్ రెడీ చేస్తున్నారు. ఇందులో మెయిన్ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ గా నిలిచేలా ఉంటాయిని తెలిసింది. ఇందులో తేజ్ కు జంటగా కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ నటిస్తుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
రిపబ్లిక్ తర్వాత విరూపాక్ష, బ్రో చిత్రాల్లో నటించాడు. ఇందులో విరూపాక్ష బ్లాక్ బస్టర్ అయితే.. బ్రో మూవీ యావరేజ్ గా నిలిచింది. బ్రో మూవీ వచ్చి రెండేళ్లు అవుతుంది కానీ.. ఇంత వరకు తేజ్ నుంచి కొత్త సినిమా రాలేదు. బ్రో మూవీ తర్వాత చాలా కథలు విని ఫైనల్ గా సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తేజ్ పై 100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడం అంటే.. రిస్కే. అయితే.. కథ పై ఉన్న నమ్మకంతో అంత బడ్జెట్ పెట్టి మంచి క్వాలిటీతో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడంటే.. సంక్రాంతికి రిలీజ్ చేస్తే.. ఈ భారీ బడ్జెట్ మూవీకి వర్కవుట్ అవుతుందని ఆలోచిస్తున్నారట. మరి.. పక్కాగా క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే