
ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..
త్వరలో పీఎఫ్ 3.0 సేవలు అంటే ఈ నెల నుంచే అందుబాటులోకి రానున్నాయి. పీఎఫ్ యూజర్లకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ 3.0ను అమల్లోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా ఏటీఎమ్ విత్డ్రాల్స్, ఆటో క్లైమ్ సెటిల్మెంట్, ఓటీపీ బేస్డ్ అకౌంట్ అప్డేట్స్ వంటి చాలా రకాల సర్వీసులను సులభతరం చేస్తుంది. అవేమిటంటే..
ఏటీఎమ్ విత్ డ్రా..
ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ ఇలాంటి సర్వీస్ ను అందుబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. ఖాతాదారులు తమ ఈపీఎఫ్ డబ్బుల్ని ఇక ఏటీఎమ్ ద్వారా నేరుగా విత్ డ్రా చేసుకోవచ్చు.
క్లైమ్ సెటిల్మెంట్ అయిపోయిన వెంటనే ఎంచక్కా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు.
ఆటోమేటెడ్ క్లైమ్ సెటిల్మెంట్..
ఈపీఎఫ్ఓ 3.0లో ఈ సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఆటోమేటెడ్ క్లైమ్ సెటిల్మెంట్ ద్వారా ప్రాసెసింగ్ టైం, మనుషుల జోక్యం తగ్గి, డబ్బులు ఎర్లీగా ఖాతాదారుడి బ్యాంక్ అకౌంట్లో పడతాయి.
డిజిటల్ అకౌంట్ కరెక్షన్..
డిజిటల్ అకౌంట్ కరెక్షన్ అనేది యూజర్లు తమ పర్సనల్ డేటాను.. పేరు, డేట్ ఆఫ్ బర్త్ డేలతో పాటు ఇతర వివరాలను ఆన్లైన్ ద్వారానే కరెక్ట్ చేసుకోవచ్చు. ఇకపై ఫామ్ ఫిల్ చేసి, సబ్మిట్ చేసి అప్రూవల్ అయ్యేవరకు వేచి చూడాల్సిన పని లేదు.
గ్రీవియెన్స్ రెడ్రెసల్..
ఈపీఎఫ్ఓ సంస్థ గ్రీవియెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌ను అప్డేట్ చేసే పనిలో ఉంది. 3.0 ద్వారా ఖాతాదారుల సమస్యలను అత్యంత వేగంగా సాల్వ్ చేస్తుంది.
వీటితో పాటు సోషల్ సెక్యూరిటీ ఇంటిగ్రేషన్, హెల్త్ కేర్ ఎక్స్పాన్షన్, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్ ధన్ యోజన వంటి సెంట్రల్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటినీ ఈపీఎఫ్ఓకు అనుసంధానించడానికి ప్రయత్నిస్తుంది.