ఏఐ సహాయంతో శిశఉవుకు జన్మ

Spread the love

ముందుముందు రానున్న కాలం అంతా కృత్రిమ మేధస్సుతో నిండుకోనుంది. అన్ని పనులు, సేవలు ఏఐ తోనే జరుగుతాయి అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదేమో. అయితే దీనికి గినట్టుగానే తాజాగా మెక్సికోలో ఓ శిశువు ఏఐ సహాయంతో జన్మించింది. ఏఐ అసిస్టెడ్ ఐవీఎఫ్ విధానంలో ప్రపంచంలోనే తొలిసారిగా ఈ శిశువు పురుడు పోసుకుంది. మెక్సికోలోని హోప్ ఐవీఎఫ్ సెంటర్లో వైద్య నిపుణుల సమక్షంలో ఓ 40 ఏళ్ల మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అండంలోకి వీర్యాన్ని నేరుగా ఇంజెక్ట్ చేసే ఇంట్రాసైటో ప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్(ICSI) కు బదులుగా ఆటోమేటెడ్ ఐవీఎఫ్ సిస్టమ్ ను ఉపయోగించారు.

ఈ విధానానికి ఏఐ సహాయం తీసుకున్నట్టు వైద్యబృందం ప్రకటించింది. దీని ద్వారా ఐసీఎస్ఐ ప్రక్రియకు పట్టే 23 దశలేవీ మనిషి సహాయం లేకుండానే పూర్తయ్యాయి. ఈ ప్రక్రియకు కేవలం 9 నిమిషాల 56 సెకండ్లు పట్టిందని వారు పేర్కొన్నారు. ఏఐ ద్వారా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి అనడానికి ఇది నిదర్శనం, ఇదే తొలి అడుగుగా భావిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఏఐతో ముందుముందు ఇంకా ఎన్నో మార్పులు చేయొచ్చు అని, అద్భుతాలు సృష్టించొచ్చు అని అంతా భావిస్తు్న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *