
Vishnu Hypersonic Cruise Missile: భారత రక్షణ రంగంలో ఒక విప్లవాత్మక అడుగు పడనుంది. విష్ణు అనే హైపర్‌సోనిక్ క్షిపణి భారత్‌ను అతి శక్తివంతమైన సైనిక శక్తిగా మరో స్థాయికి తీసుకెళ్లనుంది. ఈ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటిగా నిలవనుంది. దీనిని తయారీ పూర్తయితే ప్రపంచంలో అత్యంత భయంకరమైన హైపర్‌సోనిక్ ఆయుధం భారత్ దగ్గర ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.. అంత సత్తా ఈ క్షిపణిలో ఏముంది..? ఈ క్షిపణిని ఏ రాడార్ పసిగట్టలేదా..? ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపలేదా..? ఇలాంటి టెక్నాలజీ ఇంకా ఎవరి దగ్గర ఉంది..?
భారత సైన్యం అమ్ములాపొదిలో బ్రహ్మాస్త్రాన్ని మించిన అస్త్రం త్వరలో చేరబోతోంది. భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు విష్ణు అనే హైపర్‌సోనిక్ క్షిపణిని అభివృద్ధి చేస్తోంది. దీని పూర్తి పేరు వెహికల్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్ స్ట్రాటజిక్ హైపర్‌సోనిక్ నావిగేషన్ అండ్ యుటిలిటీ.. షార్ట్ కట్ లో విష్ణు అంటారు.. ఈ క్షిపణి మాక్ 10 వేగం అంటే.. గంటకు 12,348 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు, అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. దీనిని భూమి, సముద్రం, గాలి ఎక్కడి నుంచి అయినా ప్రయోగించవచ్చు. శత్రు రాడార్‌లను తప్పించుకుని, ఆధునిక మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కు అంతకుండా శత్రు లక్ష్యాలను చేధించగలదు. ఈ క్షిపణి, భారత్‌ను రష్యా, చైనా వంటి దేశాల సరసన నిలబెడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. DRDOఈ క్షిపణిని పరీక్షించేందుకు సిద్ధమవుతోంది, ఇది భారత రక్షణ వ్యవస్థకు ఒక విప్లవాత్మక ఆయుధంగా మారనుంది.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హైపర్‌సోనిక్ క్షిపణిగా రష్యా తయారీ అవన్‌గార్డ్ గుర్తింపు పొందింది. ఈ క్షిపణిని ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీతో కూడిన హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్ గా చెబుతారు. 2019లో రష్యా దీనిని అభివృద్ధి చేసింది, ఇది మాక్ 20-27 వేగంతో అంటే గంటకు 24 వేల నుంచి 33 వేల కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. 2 మెగాటన్‌ల అణ్వాయుధాన్ని మోసుకెళ్లగల ఈ క్షిపణి, 10 వేల కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. దాని గాలిలోనే దిశను మార్చుకునే సామర్థ్యం అవన్‌గార్డ్ ప్రత్యేకత. దీనివల్ల ఆధునిక రాడార్, క్షిపణి నిరోధక వ్యవస్థలు దీనిని గుర్తించడం ఆపడం దాదాపు అసాధ్యం. అమెరికా వంటి దేశాలకు కూడా ఈ క్షిపణిని నిలువరించే సాంకేతికత లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు అవన్‌గార్డ్‌ను ఆధునిక యుద్ధంలో అత్యంత భయంకర ఆయుధంగా నిలబెట్టాయి.
విష్ణు క్షిపణి భారత్ స్వదేశీ సాంకేతికతతో రూపొందిన బహుముఖ హైపర్‌సోనిక్ ఆయుధం. ఇది మాక్ 10 వేగంతో ప్రయాణించగలదు, ఇది రష్యా అవన్‌గార్డ్ కంటే మూడు రెట్లు వేగవంతమైనదని నిపుణులు అంచనా వేస్తున్నారు. శత్రు రాడార్‌లను తప్పించుకునే సామర్థ్యం, ఆధునిక క్షిపణి నిరోధక వ్యవస్థలనకు అంతకుండే ఉండే సాంకేతికత దీని ప్రధాన బలాలు. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం దీనిని భారత అణు నిరోధక వ్యవస్థలో కీలక ఆయుధంగా నిలబెట్టనుంది. DRDO ఈ క్షిపణిని 2026-27 నాటికి పూర్తి చేసి, పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్షిపణి భారత్ రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అవన్‌గార్డ్, విష్ణు మధ్య పోలిక ఏంటి..?
రష్యా అవన్‌గార్డ్, భారత్ విష్ణు క్షిపణులు రెండూ హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్స్‌గా రూపొందాయి, కానీ వాటి సామర్థ్యాలు, లక్షణాలలో తేడాలు ఉన్నాయి. అవన్‌గార్డ్ మాక్ 20-27 వేగంతో, 10,000 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు, 2 మెగాటన్‌ల అణ్వాయుధాన్ని మోసుకెళ్లగలదు. దీని గాలిలో దిశ మార్చుకునే సామర్థ్యం దీనిని ఆధునిక రక్షణ వ్యవస్థలకు అందకుండా చేస్తుంది. మరోవైపు, విష్ణు క్షిపణి మాక్ 10 వేగంతో ప్రయాణిస్తుంది, అయితే భూమి, సముద్రం, గాలి నుంచి ప్రయోగించే సామర్థ్యం దీనిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. విష్ణు కూడా అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది, రాడార్‌లను తప్పించుకునే సాంకేతికతను కలిగి ఉంటుంది. అవన్‌గార్డ్ ప్రస్తుతం ఆపరేషనల్‌గా ఉండగా, విష్ణు ఇంకా అభివృద్ధి దశలో ఉంది. విష్ణు పూర్తయిన తర్వాత, ఇది అవన్‌గార్డ్‌తో సమానమైన లేదా అంతకంటే మెరుగైన సామర్థ్యాలను ప్రదర్శించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
విష్ణు క్షిపణి భారత్‌కు ఎందుకు ముఖ్యం?
విష్ణు క్షిపణి భారత రక్షణ వ్యవస్థలో ఒక విప్లవాత్మక ఆయుధంగా రూపొందనుంది. ఆసియా ప్రాంతంలో చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి ఉన్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ క్షిపణి భారత్‌కు ఎంతో శక్తిని అందిస్తుంది. చైనా ఇప్పటికే హైపర్‌సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తుండగా, పాకిస్తాన్ క్షిపణి సామర్థ్యాలు విష్ణుతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నాయి. విష్ణు క్షిపణి శత్రు లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు, దీనివల్ల భారత్‌కు పాకిస్థాన్ లోని ప్రధాన భూభాగాలపై ఆధిపత్యం లభిస్తుంది. Vishnu Hypersonic Cruise Missile.
భవిష్యత్తులో హైపర్‌సోనిక్ ఆయుధాల హవా ఎలా ఉండనుంది..?
హైపర్‌సోనిక్ ఆయుధాలు ఆధునిక యుద్ధ యుగంలో కొత్త శకాన్ని తీసుకొస్తున్నాయి. రష్యా, చైనా, అమెరికా వంటి దేశాలు ఇప్పటికే ఈ రంగంలో పురోగతి సాధిస్తున్నాయి. రష్యా అవన్‌గార్డ్, చైనా యొక్క DF-ZF వంటి క్షిపణులు హైపర్‌సోనిక్ సాంకేతికతలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. భారత్ విష్ణు క్షిపణి ఈ రంగంలో ఒక కీలకమైన అడుగుగా భావించబడుతోంది. ఈ క్షిపణి ఆసియా ప్రాంతంలో భారత్ సైనిక ఆధిపత్యాన్ని బలోపేతం చేయడమే కాక, ప్రపంచ సైనిక సాంకేతిక శక్తులలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టనుంది. హైపర్‌సోనిక్ ఆయుధాల వేగం, ఖచ్చితత్వం, రాడార్‌లను తప్పించే సామర్థ్యం ఆధునిక యుద్ధంలో గేమ్-ఛేంజర్‌గా మారనున్నాయి.