థియేటర్లలో ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్న ‘మై బేబి’

Spread the love

My Baby తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన డీఎన్ఏ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి తెలుగులో మై బేబి పేరుతో ఈ నెల 18 థియేటర్లలో విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే ఎంతోమంది సినీ ప్రముఖులు, జర్నలిస్టులు ఈ చిత్రాన్ని వీక్షించి సురేష్ కొండేటిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత మంచి చిత్రాన్ని అందించినందుకు ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా సురేష్ కొండేటిని కొనియాడారు. వాళ్లందరి మాటలను నిజం చేస్తూ తెలుగు ప్రేక్షకులు కూడా మైబేబి చిత్రానికి థియేటర్లలో అద్భుతమైన స్పందనను కనబరుస్తున్నారు. తల్లీబిడ్డల సెంటిమెంట్, థ్రిల్ పంచే స్క్రీన్ ప్లే, అధర్వ నటన, ఇన్వెస్టిగేషన్‌ సాగే తీరు, కథ, దర్శకత్వం ఇలా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎన్నో ప్లస్‌లు ఉన్నాయి.

‘ధోనీ పుట్టిన సమయంలోనే కొన్ని వందల మంది పుట్టి ఉంటారు. అందరూ ధోనీ అవ్వలేరు కదా’ తల్లిదండ్రులు కావాలనుకునే ఓ జంట సినిమాలో చెప్పే డైలాగ్‌ ఇది. ప్రజల నమ్మకాలు, మూఢవిశ్వాసాలు పరిధులు దాటిపోతున్నాయి. కాబోయే తల్లిదండ్రుల అమాయకత్వాన్ని కొందరు సొమ్ము చేసుకుంటుంటే.. మరికొందరు దాన్నే ఓ వ్యాపారంగా మలుచుకుంటున్నారు. పుట్టిన బిడ్డ పురిటిలోనే చేతులు మారిపోతున్న సంఘటనలు ఎన్నో. దీన్నే కథగా మలిచి ఆద్యంతం అలరించేలా సినిమాను తీర్చిదిద్దడంలో దర్శకుడు నీల్సన్‌ వెంకటేశన్‌ విజయం సాధించారు. రెండు గంటల పాటు ప్రేక్షకుడికి థ్రిల్‌ పంచారు. ఆనంద్‌గా అధర్వ తనదైన నటనతో మెప్పించాడు. పోలీసులకు సమాంతరంగా ఇన్వెస్టిగేషన్‌ చేసే తీరు మెప్పిస్తుంది. దివ్యగా నిమిష సజయన్‌ ఒదిగిపోయింది. బిడ్డను కోల్పోయిన తల్లిగా ఎమోషనల్‌ సన్నివేశాల్లో చక్కగా నటించింది. వరదరాజన్‌గా మహ్మద్‌ జీషాన్‌ ఆయూబ్‌ నటన సెటిల్డ్‌గా ఉంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ అన్నీ చక్కగా కుదిరాయి. మొత్తంగా థియేటర్‌కు వెళ్లే ప్రతి ప్రేక్షకుడికి వాళ్లు పెట్టిన డబ్బులకు రెట్టింపు న్యాయం జరిగేలా సినిమా ఉందని చెప్పొచ్చు. My Baby