వెయిట్ ను నియంత్రించడంలో ‘స్టార్’ ఈ ఫ్రూట్!

Spread the love

Star Fruit Health Benefits: పండ్లలో స్టార్ ఫ్రూట్.. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఈ ఫ్రూట్.. చూడ్డానికి అచ్చం నక్షత్రం ఆకారంలో కనిపిస్తుంది. బాగా పండిన తర్వాత పసుపురంగులోకి మారి భలే తియ్యగా ఉంటుంది. పచ్చి పండ్లు పుల్లగా ఉంటాయి. వెయిట్‌ లాస్‌ డైట్ ఫాలో అవుతున్నవారు ఈ పండు తింటే చాలా మంచిది. ఈ స్టార్ ప్రూట్‌లో ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల కలిగే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే..

ఈ పండులో పుష్కలంగా డైటరీ ఫైబర్/ కరిగే కొవ్వు ఉండటం వల్ల ఇది చెడు కొలెస్ట్రాల్‌ చర్యను నిరోధిస్తుంది. అలానే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు తరచుగా స్టార్‌ఫ్రూట్‌ తింటే మేలు చేస్తుంది.
జలుబు, దగ్గు తరచుగా వేధిస్తున్నవారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది.
ఎముక, కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
జీవక్రియను వేగవంతం చేస్తుంది.

ఇందులో లో ఫైబర్‌ పుష్కలంగా లభించడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి బాగా ప్రయోజనకారి. ఇది ఎక్కువ కేలరీలను సైతం ఇట్టే బర్న్‌ చేస్తుంది. ఫలితంగా బరువు అనేది కంట్రోల్‌లో ఉంటుంది. Star Fruit Health Benefits.

స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సి‘తో పాటు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కాంబినేషన్ ఇమ్యూనిటీని డబుల్ చేస్తుంది. ఈ ఫ్రూట్‌లో మెగ్నీషియం, ఐరన్, జింక్, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం వంటి మినరల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఆనారోగ్యాల నుంచి రక్షిస్తాయి.

గుండె సమస్యతో బాధపడుతున్నవారికి కూడా ఈ పండు మేలు చేస్తుంది. ఇందులోని మినరల్స్ రక్తపోటును నియంత్రించడంలో సాయపడతాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడేవారు ఈ ఫ్రూట్ కి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే కొన్ని పదార్థాలు మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తాయి. నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను కలిగిస్తాయి. అందువల్ల ఈ కారణాలున్నవారు బెటర్ టు అవాయిడ్.

Also Read: https://mega9tv.com/life-style/can-a-root-canal-cause-heart-problems-absolutely-not-check-why/