కింగ్ డమ్ సర్ ప్రైజ్ ఏంటి..? టార్గెట్ ఎంత..?

Spread the love

What is Kingdom Surprise: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి.. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన చిత్రం కింగ్ డమ్. ఈ సినిమా పై విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో కింగ్ డమ్ సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది. అయితే.. ఈ భారీ పాన్ ఇండియా మూవీలో ఓ సర్ ఫ్రైజ్ రోల్ ఉందట. ఇంతకీ.. ఆ సర్ ఫ్రైజ్ రోల్ పోషించింది ఎవరు..? కింగ్ డమ్ టార్గెట్ ఎంత..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కింగ్ డమ్ ఈ సినిమా శ్రీలంక నేపథ్యంతో రూపొందింది. ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు అసలు కథ ఏంటి..? ఎలా ఉంటుంది..? అనేది లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పై ఆడియన్స్ లో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అయితే.. ఈ ట్రైలర్ చూసిన తర్వాత బయటకు వచ్చిన కొత్త వార్త ఏంటంటే.. ఇందులో ఓ తెగ కనిపిస్తుంది. దానికి ఓ నాయకుడు కూడా కనిపించాడు. అయితే.. ఆ నాయకుడు పాత్ర పోషించింది ఎవరు అనేది మాత్రం క్లియర్ గా చూపించలేదు. ఇది సినిమాలో సర్ ఫ్రైజ్ గా ఉంటుందట. అయితే.. ఆ సర్ ఫ్రైజ్ రోల్ పోషించింది కూడా విజయ్ దేవరకొండే అనే టాక్ వినిపిస్తుంది. What is Kingdom Surprise.

అలాగే ఆ సర్ ఫ్రైజ్ రోల్ పోషించింది మరో యాక్టర్ అనే మాట కూడా వినిపిస్తుంది. దీంతో కింగ్ డమ్ లో సర్ ఫ్రైజ్ రోల్ పోషించిన యాక్టర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ మూవీ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ 50 కోట్లకు పైగానే జరిగిందని తెలుస్తుంది. ఈ లెక్క ప్రకారం 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయాలి. ట్రైలర్ తో ఈ మూవీకి మరింతగా బజ్ క్రియేట్ అవ్వడంతో ఖచ్చితంగా కింగ్ డమ్ సినిమా విజయ్ కి మంచి ఫలితాన్ని అందిస్తుందని ట్రేడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.

విజయ్ దేవరకొండ కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా సక్సెస్ సాధించాడు. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. అయితే.. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో వరుసగా నిరాశపరచడంతో కెరీర్ లో వెనకబడ్డాడు. ఇప్పుడు ఎలాగైనా సరే.. సక్సెస్ సాధించాలని తపిస్తున్నాడు. కింగ్ డమ్ కథ, కథనం వైవిధ్యంగా ఉంటాయని.. ఖచ్చితంగా ఆడియన్స్ ని మెప్పిస్తుందని.. విజయ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. నిర్మాత నాగవంశీ అయితే.. సక్సెస్ పై నమ్మకంతో ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. మరి.. ఇందులో ఆ సర్ ఫ్రైజ్ రోల్ పోషించింది ఎవరో..? టార్గెట్ రీచ్ అవుతాడో లేదో తెలియాలంటే.. ఈ నెల 31 వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read: https://mega9tv.com/cinema/chiranjeevi-is-acting-in-a-socio-fantasy-movie-vishwambhara-vishwambhara-movie-director-mallidi-vashisht-ram-charan-is-acting-in-a-movie-peddi/