చైతూ మూవీ కోసం అంత ఖర్చు పెడుతున్నారా..?

Spread the love

Naga Chaitanya’s NC24: అక్కినేని నాగచైతన్య తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించడం.. 100 కోట్ల క్లబ్ లో చేరడం తెలిసిందే. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్ తో చైతూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం కార్తీక్ దండుతో సినిమా చేస్తున్నాడు. మిస్టిక్ థ్రిల్లర్ గా రూపొందే ఈ మూవీని సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే.. ఈ మూవీ బడ్జెట్ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ.. ఏంటా న్యూస్..? ఈ భారీ చిత్రం రిలీజ్ ఎప్పుడు..?

కార్తీక్ దండు విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత నాగచైతన్య కోసం ఓ డిఫరెంట్ స్టోరీ రెడీ చేశాడు. ఇది రెగ్యులర్ స్టోరీ కాదు. వైవిధ్యమైన కథాంశం కావడంతో చైతన్యకు బాగా నచ్చింది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాకి 100 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందట. కథ డిమాండ్ చేయడంతో.. నాగచైతన్య మార్కెట్ ను మించి ఈ మూవీకి ఖర్చు చేస్తున్నారు. తండేల్ సినిమాను దాదాపు 70 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. నిర్మాత బన్నీ వాసు చెప్పి మరీ ఈ రేంజ్ సక్సెస్ అందించడం విశేషం.

ఇప్పుడు నాగచైతన్య సినిమాకి 100 కోట్లు బడ్జెట్ పెట్టడం అనేది హాట్ టాపిక్ అయ్యింది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఇందులో ఓ సెట్ కోసమే 10 కోట్లు ఖర్చు పెట్టారట. ఫస్ట్ టైమ్ నాగచైతన్య సినిమా సెట్ కి 10 కోట్లు ఖర్చు పెట్టడం ఆసక్తిగా మారింది. ఇందులో చైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఇటీవల హైదరాబాద్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. చైతన్య గెటప్ చాలా కొత్తగా ఉంది. గెటప్ మాత్రమే కాదు.. ఇందులో ఉండే కథ, కథనం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట. ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడట కార్తీక్ దండు. Naga Chaitanya’s NC24.

ఈ సినిమాకి ఎంత ఖర్చు అయినా పెడతానికి వెనకాడడం లేదు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్. అలాగే త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో కూడా లేరట. ఎప్పుడు కంప్లీట్ అయితే.. అప్పుడే రిలీజ్ చేద్దామని.. ఎలాంటి రిలీజ్ టార్గెట్స్ పెట్టుకోకుండా వర్క్ చేస్తున్నారు. దీని వలన క్వాలిటీ అవుట్ ఫుట్ వస్తుంది అనేది మేకర్స్ ఆలోచన. త్వరలో తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తైన తర్వాత రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటిస్తారని సమాచారం. మరి.. ఈ మూవీతో చైతూ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/coolie-and-war-2-run-times-who-will-emerge-the-winner/