నిజామాబాద్ ఓటరు జాబిత…!

Spread the love

Nizamabad Voters List: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికారులు. ఇప్పటికే సిబ్బందికి మొదటి విడత శిక్షణ ఇవ్వడంతో పాటు వార్డుల వారీగా జాబితాను విభజన చేశారు. ఒక గ్రామం యూనిట్గా జాబితాను గ్రామ కార్యదర్శులు సిద్ధం చేయడంతో పాటు బ్యాలెట్ బాక్సులు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల వారీగా కొత్త ఓటర్ల జాబితా సిద్ధమైంది. గ్రామాన్ని ఓ యూనిట్ గా తీసుకుని ఓటర్ల జాబితాను గ్రామ కార్యదర్శులు సిద్ధం చేశారు. గత జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారిగా జాబితాను విభజించారు. ఒక కుటుంబం ఓటర్ల ఒకే వార్డులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలను ప్రభుత్వం ఖరారు చేయగా, గ్రామపంచాయతీల వార్డుల జాబితాను సైతం జిల్లా అధికారులు సిద్ధం చేశారు.

గ్రామపంచాయతీల ఓటరు జాబితాను ఎంపీడీవో లాగిన్తో టీ పోల్ సాఫ్ట్వేర్ లో పొందుపరిచారు. జిల్లాలో మొత్తం 545 గ్రామపంచాయతీలు ఉండగా 8 లక్షల 51 వేల 770 మంది ఓటర్లు ఉన్నారు. ఇక జిల్లాలో రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 545 గ్రామపంచాయతీలకు చెందిన 5 వేల 22 వార్డులు ఉన్నాయి. ఇందులో 281 గ్రామపంచాయతీలకు చెందిన 2 వేల 510 వార్డుల్లో మొదటి విడత, 264 గ్రామపంచాయతీలు 2 వేల 512 వార్డుల్లో రెండో విడతలో ఎన్నికలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

అలాగే పంచాయతీ ఎన్నికల పోలింగ్ కావలసిన బ్యాలెట్ బాక్సులు జిల్లా అధికారులు సిద్ధం చేశారు. గుజరాత్ నుండి 3 వేల 440 బ్యాలెట్ బాక్సులు తెప్పించారు. వీటితో పాటు జిల్లాలో 3 వేల 846 బాక్సులు జిల్లాలో సిద్ధంగా ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలకు పెద్ద బాక్సులు వార్డు సభ్యులకు చిన్న బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు.

జిల్లా కేంద్రం నుండి మండలాలకు బ్యాలెట్ బాక్సులను తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జిల్లాలో 2 వేల 531 జంబో బాక్సులు 13 వందల 15 చిన్న బ్యాలెట్ బాక్సులు పంచాయతీ ఎన్నికలకు వినియోగించనున్నారు. మొదటి విడత ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను రెండో విడత జరిగే గ్రామాలకు తరలించి ఎన్నికలు నిర్వహిస్తారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ సైతం ఇదివరకే అధికారులు పూర్తి చేశారు. Nizamabad Voters List.

సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు 9 లక్షల21 వేలు వార్డు సభ్యులకు సంబంధించి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు 9 లక్షల 20 వేలు మొత్తం 18 లక్షల 41 వేల బ్యాలెట్ పత్రాలు ఎన్నికల విభాగం స్ట్రాంగ్ రూములో భద్రపరిచారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఇప్పటికే రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారులు సిబ్బందికి మొదటి విడత శిక్షణ నిర్వహించారు. అలాగే ఓట్ల లెక్కించేందుకు సిబ్బందిని వార్డుల వారీగా నియమించనున్నారు.

Also Read: https://mega9tv.com/telangana/telangana-ranks-top-in-the-country-in-alcohol-use/