
Pawan Kalyan and Surender Reddy Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న. అది అభిమానులకు పండగ రోజు. అయితే.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్న రోజుల్లో కొత్త సినిమాలను ప్రకటించేవారు. ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీ అయ్యారు. ఇప్పుడు పుట్టినరోజు వస్తుంది. మరి.. కొత్త సినిమాను ప్రకటిస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. లేటెస్ట్ ప్రచారం ఏంటంటే.. ఓ సినిమాను అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ సినిమా ఏంటి..?
పవన్ కళ్యాణ్ తను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశారు. ఒకటి వీరమల్లు అయితే.. మిగిలినవి ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఓజీ మొత్తం షూటింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ 25 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే.. పవర్ స్టార్ క్యారెక్టర్ వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మిగిలిన క్యారెక్టర్స్ తో షూటింగ్ చేయాల్సివుంది. దీనిని కూడా త్వరలోనే పూర్తి చేయడానికి ప్లాన్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇటీవల పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలిసున్న ఫోటో బయటకు రిలీజ్ చేయడం.. అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే.
ఈ క్రేజీ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిసింది. అయితే.. పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాల్లో బ్యాలెన్స్ ఓ సినిమా ఉంది. అదే.. సురేందర్ రెడ్డితో సినిమా. దీనికి రామ్ తాళ్లూరి నిర్మాత. ఈ మూవీని అధికారికంగా ప్రకటించడం జరిగింది కానీ.. ఇంత వరకు పట్టాలెక్కలేదు. ఆతర్వాత ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి ఇంత వరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. కొన్ని ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ.. అవి వర్కవుట్ కాలేదు. Pawan Kalyan and Surender Reddy Movie.
తాజాగా సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారని.. ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాను పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అనౌన్స్ చేస్తారని కూడా అంటున్నారు. ఈ ఒక్క సినిమా కంప్లీట్ చేస్తే.. ఒప్పుకున్న అన్ని సినిమాలు చేసినట్టు అవుతుంది. పైగా రామ్ తాళ్లూరి ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు. ఈ సినిమా చేయకపోతే బాగోదని.. తనని నమ్మిన వాళ్లకి ఖచ్చితంగా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారని పవన సన్నిహితులు చెబుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి.. పవన్ బర్త్ డేకి అనౌన్స్ మెంట్ వస్తుందో లేదో చూడాలి.
Also Read: https://mega9tv.com/cinema/what-was-the-interesting-update-about-the-pawan-kalyans-og/