ట్రంప్ , బైడెన్ కుటుంబా మధ్య మాటల యుద్ధం..!

Spread the love

Hunter Biden And Melania Trump: అమెరికా మాజీ ఫస్ట్ లేడీ, ట్రంప్ భార్య మెలానియా, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సెక్స్ స్కాండెల్ వ్యవహారంతో మెలానియాకు ముడిపెడుతూ హంటర్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. తన తన కుటుంబ పరువు తీసేందుకు హంటర్ బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మిలానియా మండిపడుతున్నారు. అంతేకాదు హంటర్ వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని.. పబ్లిక్ గా క్షమాపణ చెప్పాలని.. డిమాండ్ చేశారు లేకపోతే ఒక బిలియన్ డాలర్లు అంటే అక్షరాల 8 వేల కోట్ల రూపాయలకు పైనే పరువునష్టం కేసు పెడతానని బెదిరించారు.. అసలు జో బైడెన్ కుమార్ హంటర్ బైడెన్ ఏం నోరు జారారు..? ఈ వ్యాఖ్యలతో ఎలాంటి దుమారం రేగింది..? ఇంది ట్రంప్, బైడెన్ కుటుంబాల మధ్య ఎలా వైరాన్ని రేపింది..?

కొద్ది రోజులుగా జెఫ్రీ ఎపె స్టీన్ సెక్స్ స్కాండెల్ వ్యవహారం అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్నాయి. బాలికలపై లైంగిక ఆరోపణలు ఎందుర్కొంటూ జైలులో చనిపోయిన ఎపె స్టీన్ కు ట్రంప్ కు సంబంధాలు ఉన్నాయని .. మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అయితే ఇవి కేవలం రాజకీయ కుట్రలో భాగమేనని.. తమ పరువు తీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ అంటున్నారు. అటు సెక్క్ స్కాండెల్ లో ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్ స్టీన్ తో ట్రంప్ ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ వివాదం కాస్త మరింత వేడెక్కింది. ముఖ్యంగా ట్రంప్ పెళ్లి వీడియోలో జెఫ్రీతో ట్రంప్ చాలా క్లోజ్ గా ఉన్న దృష్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటి ఆధారంగా ప్రతిపక్ష నేతలు ట్రంప్ ను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. ఈ విధంగానే అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ట్రంప్ భార్య మెలానియాపై కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఈ వివాదంపై తీవ్రస్థాయికి వెళ్లింది.

హంటర్ బైడెన్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో జెఫ్రీ ఎప్ స్టీన్ కేసు, ట్రంప్ పై వస్తున్న ఆరోపణలపై కొన్ని విమర్శలు చేశారు. ఇందులో అసలు ట్రంప్ కు మెలెనియాను పరిచయం చేసిందే ఎప్ స్టీన్ అని ఆరోపించారు హంటర్ బైడెన్. ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైల్స్‌లో ట్రంప్ పేరు ఉందని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చను రేకెత్తించాయి. హంటర్ ఈ వాదనలను రచయిత మైఖేల్ వోల్ఫ్ కథనాలు ఆధారంగా చెప్పానని తెలిపారు. అయితే గతంలో ఇలాంటి వాదనలనే అమెరికాకు చెందిన డైలీ బీస్ట్ పత్రికి ప్రచురించి అభాసుపాలైంది.. దానికి క్షమాపణ కూడా చెప్పిందని ట్రంప్ టీమ్ అంటోంది. ఇది తెలియకుండా హంటర్ ఎలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని వెంటనే హంటర్ క్షమాపణలు చెప్పాలని మెలానియా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే హంటర్‌పై 1 బిలియన్‌ డాలర్లకు అంటే భారత కరెన్సీలో అక్షరాల 8.7 వేల కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మెలానియా తరఫు న్యాయవాది అలెజాండ్రో బిట్రో ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. హంటర్‌ వ్యాఖ్యలు మెలానియా పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఆమెకు ఉందన్నారు. హంటర్‌ తన తప్పుడు ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే మెలానియా ట్రంప్‌నకు కలిగిన పరువునష్టానికి 1 బిలియన్‌ డాలర్లు దావా వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అంటూ హంటర్ వ్యాఖ్యలపై ట్రంప్ టీమ్ ఎదురుదాడికి దిగింది. హంటర్ బైడెన్ వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశంతో చేసినవని ట్రంప్ టీమ్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు ట్రంప్ కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి, రిపబ్లికన్‌లపై డెమొక్రాట్‌ల రాజకీయ దాడిలో భాగంగా ఉన్నాయని వారి వాదన. హంటర్ తన ఇంటర్వ్యూలో ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు ఉందని, అతను మెలానియాను పరిచయం చేశాడని చెప్పడం, ఆధారాలు లేని వ్యాఖ్యలని మెలానియా లీగల్ టీమ్ పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ట్రంప్-బైడెన్ కుటుంబాల మధ్య దీర్ఘకాల రాజకీయ శత్రుత్వాన్ని మరింత రెచ్చగొట్టాయి.

ఒక బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా ఎందుకు?
మెలానియా ట్రంప్ యొక్క వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠకు ఈ ఆరోపణలు తీవ్ర నష్టం కలిగించాయని, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారా ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి చేరాయని ట్రంప్ లీగల్ టీమ్ వాదిస్తోంది. అమెరికా, యూకేలో పరువునష్టం కేసుల్లో పెద్ద మొత్తాలను డిమాండ్ చేయడం సాధారణం, కానీ కోర్టులో ఈ మొత్తం మంజూరు అవుతుందా లేదా అనేది జడ్జి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆరోపణలు మెలానియా పబ్లిక్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయిని, జెఫ్రీ ఎప్‌స్టీన్ వివాదాస్పద కేసుతో ఆమె పేరును లింక్ చేయడం ద్వారా ఆర్థిక, సామాజిక నష్టం కలిగిందని వారి వాదన.

హంటర్ బైడెన్ స్పందన ఏమిటి?
ప్రస్తుతానికి హంటర్ బైడెన్ లేదా అతని లీగల్ టీమ్ నుంచి అధికారిక స్పందన రాలేదు. అయితే హంటర్ టీమ్ ఈ నోటీసును లీక్ చేసి, దీనిని రాజకీయంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది మెలానియా యొక్క ఇమేజ్‌ను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేందుకు చేసిన చర్య అని ఆరోపిస్తోంది. మెలానియా స్వయంగా ఈ విషయంపై పబ్లిక్‌గా మాట్లాడలేదు, ఆమె లీగల్ టీమ్ మాత్రమే ఈ పోరాటాన్ని నడిపిస్తోంది. Hunter Biden And Melania Trump.

ఈ వివాదం ట్రంప్-బైడెన్ కుటుంబాల మధ్య రాజకీయ శత్రుత్వాన్ని మరింత తీవ్రతరం చేసింది. సోషల్ మీడియా, మీడియా వేదికలలో ఈ ఆరోపణలు, లీగల్ నోటీసు విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి. ట్రంప్ అభిమానులు దీనిని మెలానియా ఇమేజ్‌ను రక్షించే యుద్ధంగా చూస్తుండగా, రాజకీయ విశ్లేషకులు దీనిని పబ్లిక్ ఫిగర్స్‌పై నిరాధార ఆరోపణల వల్ల ఏర్పడే లీగల్ సవాళ్లకు ఉదాహరణగా చూపుతున్నారు. ఈ కేసు అమెరికా రాజకీయాల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు, లీగల్ రిస్క్‌లపై కొత్త చర్చను రేకెత్తించింది.

Also Read: https://mega9tv.com/national/kannada-hero-darshan-gets-a-shock-in-the-supreme-court/