ఆ విషయంలోమహేష్‌ , బన్నీ సేమ్ టు సేమ్!

Spread the love

Allu Arjun And Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్‌ బాబు తన సినిమాల సెలక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆచితూచి సినిమాల కథలను, దర్శకులను ఎంచుకుంటాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అంతే.. కథల విషయంలోనూ, దర్శకుల విషయంలోనూ కంగారు పడి నిర్ణయాలు తీసుకోడు. ఎంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటాడు. అందుకనే కెరీర్ లో వీరిద్దరూ దూసుకెళుతున్నారు. ఇదిలా ఉంటే.. ఓ విషయంలో మహేష్‌, బన్నీని అభినందించాల్సిందే అంటున్నారు సినీ జనాలు. ఇంతకీ.. ఏ విషయంలో..? అసలు ఏం జరిగింది..?

మహేష్‌ బాబు బాలీవుడ్ వెంట పరుగులు పెట్టలేదు. మహేష్ అనుకుంటే.. బాలీవుడ్ మూవీ ఎప్పుడో చూసుండేవాడు. గతంలో ఇదే ప్రశ్న అడిగితే.. బాలీవుడ్ మూవీ చేయను. తెలుగులోనే సినిమా చేసి.. బాలీవుడ్ లో రిలీజ్ చేస్తాను అని చాలా సూటిగా చెప్పాడు. చెప్పడమే కాదు.. అదే పాటిస్తున్నాడు. బాలీవుడ్ బడా మేకర్స్ మహేష్‌ బాబుతో హిందీలో సినిమా చేయాలని ట్రై చేశారు కానీ.. ఇంత వరకు వర్కవుట్ కాలేదు. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళితో బాలీవుడ్ మూవీ కాదు.. హాలీవుడ్ మూవీ.. పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అంతే.. బాలీవుడ్ వైపు అడుగులు వేయలేదు. పుష్ప, పుష్ప 2 తర్వాత కొంత మంది బాలీవుడ్ డైరెక్టర్స్ బన్నీతో సినిమా చేయాలని ట్రై చేశారు కానీ.. ఐకాన్ స్టార్ సున్నితంగా తిరస్కరించాడు. ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తో ఆదిపురుష్‌ మూవీ చేశాడు. ఆ సినిమాకి ఎలాంటి ఫలితం వచ్చిందో చూశాం. ఓంరౌత్ పై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. Allu Arjun And Mahesh Babu.

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 చేశాడు. అయాన్ ముఖర్జీ డైరెక్టర్.. యశ్ చోప్రా సంస్థ నిర్మాణంలో రూపొందింది. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఎన్టీఆర్ పై విమర్శలు స్టార్ట్ అయ్యాయి. చరణ్ కూడా బాలీవుడ్ మూవీ జంజీర్ చేశాడు. ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇలా చరణ్, తారక్, ప్రభాస్ పొరపాట్లు చూస్తుంటే.. మహేష్, బన్నీసరైన దారిలో వెళుతున్నారు అంటూ సినీ జనాలు అభినందిస్తున్నారు. నిజంగానే బాలీవుడ్ వెంట పరుగులు పెట్టని మహేష్‌, బన్నీ ఎంతైనా అభినందనీయులు.

Also Read: https://mega9tv.com/cinema/venky-trivikrams-movie-under-haarika-and-hassine-creations-banner-venkys-movie-as-a-full-length-entertainer/