
Mass Jathara Release Date: మాస్ మహారాజా రవితేజ పేరు వినగానే మాస్ పంచ్ డైలాగ్స్, యాక్షన్, కామెడీ అన్నీ గుర్తొస్తాయి. ఆయన నటించిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులకు పక్కా ఎంటర్‌టైన్మెంట్‌ను అందించాలనే లక్ష్యంతోనే రూపొందుతుంది. తాజాగా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘మాస్ జాతర’ అనే చిత్రం ఇప్పటికే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో మేకర్స్ తరచూ మార్పులు చేస్తుండటంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది.
మొదటగా ఈ సినిమాను మే 9న విడుదల చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసిన మేకర్స్, తరువాత అది ఆగస్టు 27కి వాయిదా వేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ తేదీ కూడా కుదరకపోయినట్లు తెలుస్తోంది. మాస్ జాతర ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను అక్టోబర్ 31న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక రవితేజ కెరీర్ విషయానికి వస్తే, ‘ధమాకా’ చిత్రం తర్వాత ఆయనకు బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాలు దక్కలేదు. గత కొంత కాలంగా రవితేజ నుంచి వస్తున్న సినిమాలు ఫ్యాన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఈసారి ఓ పక్కా హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని ‘సామజవరాగమన’ మూవీతో భారీ సక్సెస్ అందుకున్న భాను బోగవరపుతో చేతులు కలిపాడు. ఈ మూవీలో ‘ధమాకా’ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది.Mass Jathara Release Date.
ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ముందుగా ప్రకటించిన ఆగస్టు 27న విడుదల కావడంలేదనే వార్తల నేపథ్యంలో, అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. సెప్టెంబర్‌లో పెద్ద సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉండటంతో, ఆ పోటీకి దూరంగా ఉండాలని నిర్మాతలు భావించి అక్టోబర్ 31న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావొచ్చని సమాచారం.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతంవిషయానికొస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పక్కా మాస్ బీట్‌లు అందించనున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రెండు మాస్ సాంగ్స్ రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మరి ఈసారి రవితేజను మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకొచ్చే సినిమా ఇదే అవుతుందా? లేదా? అనేది చూడాలి.