‘ఓజీ’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసిందోచ్..!

Spread the love

Power Star’s OG Update: పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ఓజీ’ (OG). అనౌన్స్ మెంట్ నుంచి ఈ మూవీ ప్రేక్షకులలో భారీ అంచనాలను ఏర్పరచింది. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. DVV ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో రూ.250 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మాస్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా యువ హీరోయిన్ ప్రియాంకా మోహన్ నటిస్తోంది. ఈ జంటను తెరపై ఎంతో ఆకర్షణీయంగా చూపించేందుకు దర్శకుడు సుజీత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ ‘ఫైర్ స్ట్రోమ్’ అన్నింటికంటే ప్రత్యేకంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ పవర్‌కు తగినట్లు ఉండేలా లిరిక్స్, మ్యూజిక్ , విజువల్స్ అన్నీ ఒక్కటిగా కలిసిపోయి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.

ఇప్పుడు ఈ చిత్ర బృందం నుంచి మరో అప్డేట్ వచ్చింది.ఓజీ సెకెండ్ సింగిల్ ‘సువ్వి సువ్వి’ అనే మెలోడీ సాంగ్‌ను ఆగస్టు 27న వినాయకచవితి కానుకగా ఉదయం గం.10. 08 కి విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ వదిలారు. ఈ రెండో పాట‌కు సంబంధించిన పోస్టర్ కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. Power Star’s OG Update.

అందులో పవన్ కళ్యాణ్ వైట్ షర్ట్‌లో మెరిసిపోతుండగా, ప్రియాంకా చీర కట్టులో సంప్రదాయ శైలిలో కనిపించి ఆకట్టుకుంది. మాఫియా, గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్‌గా నటిస్తున్నారు. కోలీవుడ్ యాక్టర్ అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: https://mega9tv.com/cinema/imy-telugu-title-challenge-name-the-title-win-one-lakh/