
North American OG Tickets: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ‘ఓజీ’ మూవీ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్, ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా కొన్ని రోజులు ఉండగానే, అమెరికాలో ఈ సినిమా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్‌తో దూసుకుపోతోంది.ప్రీమియర్ షోలు మొదలైన ఆరు రోజుల్లోనే ‘ఓజీ’ ఒక మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇది తక్కువ సమయంలోనే సాధించిన అరుదైన రికార్డుగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, ఒక్క నార్త్ అమెరికా మార్కెట్ నుంచే 42 వేల టికెట్లు అమ్ముడై, దాదాపు 12 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని చెబుతున్నారు. ప్రస్తుతం మొత్తం కలిపితే 1.25 మిలియన్ డాలర్లు వసూలయ్యాయని ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి. అయితే ఈ సక్సెస్‌కు ఎదురుగా ఓ చిన్న వివాదం తలెత్తింది. అమెరికాలో ‘ఓజీ’ సినిమాను విడుదల చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ సంస్థపై ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కేటాయించిన షోలు హౌస్‌ఫుల్ అయిపోయినా, ఇంకా థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేయడం లేదని వారు విమర్శిస్తున్నారు.
ఈ విమర్శలకు స్పందించిన ప్రత్యంగిరా సినిమాస్ కీలక వివరణ ఇచ్చింది. అమెరికాలో ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ అయిన AMC థియేటర్స్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించలేదని, దీనికి ప్రధాన కారణం కంటెంట్ డెలివరీ ఆలస్యం అని చెప్పారు. ఇండియాలో పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ సినిమాస్ లాంటి సంస్థలు ఉన్నట్లే, అమెరికాలో కూడా AMC వంటి పెద్ద ఫ్రాంచైజీలు ఉన్నాయి. అయితే, కొన్ని ఒప్పందాల కారణంగా, హాలీవుడ్ టైటిల్‌తో డిజైన్ చేసిన ఇండియన్ సినిమాలకు డాల్బీ ఫార్మాట్ స్క్రీనింగ్‌లో AMC ఒకటి పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిపారు. North American OG Tickets.
దర్శకుడు సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాణ సంస్థ డివీవీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి కంటెంట్ త్వరలోనే డెలివర్ అవుతుందన్న హామీ వచ్చినప్పటికీ AMC థియేటర్స్ ఇంకా కన్విన్స్ కాలేదట. అయితే, కంటెంట్ ఒకసారి అందిన తర్వాత, 3,000కిపైగా షోలు ప్లాన్ చేస్తున్నట్టు ప్రత్యంగిరా స్పష్టం చేసింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుతున్నారు. బుకింగ్స్ పూర్తిస్థాయిలో ఓపెన్ అయితే, ఓజీ మొదటి రోజే భారీ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న విడుదలవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు అమెరికాలో సెప్టెంబర్ 24న ప్లాన్ చేశారు.