
Mizoram Railway Station: మిజోరాం రాష్ట్రవాసుల దశాబ్దాల కల నెరవేరింది. తమ ప్రాంతానికి రైళ్లు ఏర్పాటు చేయాలన్న ఎన్నో ఏళ్లనాటి వారి కోరిక సాకారమైంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం రైల్వే లైన్ నిర్మించాలన్న ప్రధాని మోదీ సంకల్పంతో.. అసాధ్యం సుసాధ్యమైంది. మిజోరాం రాజధాని ఐజ్వాల్ వరకు కొండలు, లోయలను అనుసంధానిస్తూ భారీ రైల్వే లైన్‌ను రైల్వేశాఖ నిర్మించింది. అధునాతన టెక్నాలజీతో నిర్మించిన ఈ సరికొత్త రైల్వేలైన్‌ను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.
ఇది భారతీయ రైల్వే చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అంటున్నారు. సుమారు 11 ఏళ్ల పాటు శ్రమించి.. రూ.8,070 కోట్లతో నిర్మించిన ఈ మార్గం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటి అంటున్నారు అధికారులు. 51.38 కి.మీ పొడవైన ఈ మార్గంలో 45 సొరంగాలు, 153 వంతెనలు ఉన్నాయి. ఈ రైలు మార్గం మిజోరాం అభివృద్ధికి సరికొత్త మార్గం చూపిస్తుంది అంటున్నారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ. 8,070 కోట్లు ఖర్చు చేశారు. ఇది భారతీయ రైల్వే చరిత్రలోనే కాక ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా రికార్డుల్లోకెక్కింది.. 51.38 కి.మీ. పొడవైన ఈ ఇంజినీరింగ్ అద్భుతం 48 భారీ సొరంగాలు, 153 బ్రిడ్జిలను కలిగి ఉంది. కానీ ఈ రైల్వే లైన్ నిర్మాణంలో మాత్రం ఖర్చు.. సాధారణంగా ఒక కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు కన్నా పది రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఈ ప్రాజెక్టును 2008-09లో మొదలుపెట్టారు. 2015లో దీని నిర్మాణం ప్రారంభించారు. ఈ రైలు 11 ఏళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గంలో 45 సొరంగాలు, 55 పెద్ద వంతెనలు, 88 చిన్న వంతెనలు ఉన్నాయి. ఇంకా పది ఆర్‌యూబీలు, అండర్‌పాస్‌లు కూడా ఉన్నాయి. ఈ రైలు మార్గం దాదాపు 54 శాతం సొరంగాలు, వంతెనల మీదుగా వెళుతుంది. ఈ మార్గంలో సైరాంగ్ దగ్గర ఉన్న వంతెన నంబర్ 144 చాలా ప్రత్యేకమైనది. ఇది 114 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఎత్తుగా ఉంటుంది. 114 మీటర్ల ఎత్తులో సింగిల్ పిల్లర్‌పై నిర్మించిన వంతెనగా ఇది గుర్తింపు పొందింది. భూకంపాలు, భారీ ప్రవాహాలను తట్టుకొని నిలబడేలా పటిష్టంగా ఈ రైల్వే లైన్‌ని నిర్మించారు.
ఈ రైల్వే లైన్ నిర్మాణంలో 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించాల్సి రావటమే భారీ ఖర్చుకు కారణం అని తెలిపారు అధికారులు. ఈ రైల్వే లైన్ నిర్మించిన ప్రాంతంలో ఒకదాన్ని ఒకటి ఆనుకుని.. భారీ కొండలు ఉంటాయి. వాటిని తవ్వేస్తే తప్ప రైలు కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు. దీంతో 45 కొండలను తవ్వేస్తూ సొరంగాలు నిర్మించారు. రెండు కొండల మధ్య అగాధంలా.. లోయలు ఉన్నందున, సొరంగాలకు సమాంతరంగా వంతెనలు నిర్మించి దానిమీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం దాదాపు ఆరుచోట్ల అతి ఎత్తైన పిల్ల్లర్లు నిర్మించాల్సి వచ్చింది. ఇందుకోసం 70-114 మీటర్ల ఎత్తున్న పిల్లర్లు నిర్మించి వాటిని కలుపుతూ నిర్మించిన ఆ బ్రిడ్జిలను చూస్తే ఇంజనీర్ల ఎంత శ్రమించారో అర్థం అవుతుంది.
ఈ ప్రాజెక్టులో నాలుగు కొత్త స్టేషన్లు కూడా ఉన్నాయి. అవిహోర్టోకి, కవ్న్పుయి, ముయాల్ఖాంగ్, సైరాంగ్. ఈ స్టేషన్లు ఆ ప్రాంతాల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఐజాల్‌కు మొదటి రైలు లింక్ అయిన ఈ మార్గం మిజోరాం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నారు. ఈ కొత్త మార్గం అస్సాం-మిజోరాం సరిహద్దులోని బైరాబీ నుంచిసైరాంగ్ను కలుపుతుంది. సైరాంగ్.. ఐజాల్ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రైలు మార్గం ప్రారంభంతో మిజోరాం రాజధాని ఐజాల్ మొదటిసారిగా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో నేరుగా కనెక్ట్ అవుతుంది అని తెలిపారు.
ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చాలా కష్టాలు ఎదురయ్యాయని భారతీయ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.. హిమాలయాల వంటి కొండ ప్రాంతాలు, క్లిష్టమైన భూభాగం కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. ఇంజనీర్లు సొరంగాలు తవ్వడానికి ఎంతో శ్రమించారని.. వినూత్న రీతుల్లో ఈ పనులు ముగించారని చెప్పుకొచ్చారు. Mizoram Railway Station.
ఇదిలా ఉంటే దేశంలో మొత్తం ఏడు ఈశాన్య రాష్ట్రాలుండగా.. వీటిల్లో ఒక్క సిక్కింలో అసలు రైల్వే లైనే లేదు. మిగతా ఆరు రాష్ట్రాల్లో పాక్షికంగా రైల్వే లైను అందుబాటులో ఎంది. కానీ మిజోరం, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు. కానీ బైరాబీ-సైరాంగ్ వల్ల మిజోరం రాజధాని ఐజాల్‌కు రైల్వే కనెక్టివిటీ లభించబోతుంది. త్వరలోనే మిగతా వాటిని కూడా కనెక్ట్ చేస్తామని తెలిపారు.