
100% tariff on medicines: సుంకాల యుద్ధంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలను ప్రకటించారు. బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్ నుంచి అమెరికాకి మందులు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతాయి. కానీ ట్రంప్ నిర్ణయం వల్ల.. ఫార్మా కంపెనీలకు ఇది పెద్ద దెబ్బె.. అనుకోవాలి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి, బ్రాండెడ్ లేదా పేటెంట్ పొందిన ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై 100 శాతం టారిఫ్ విధిస్తామని ప్రకటించారు. అంటే భారత్ లాంటి దేశాల నుంచి అమెరికాకు వెళ్లే మందుల ధరలు అమెరికాలో దాదాపు డబుల్ కాబోతున్నాయి. సపోజ్ ఇప్పుడు ఒక ఫ్యాటీ లివర్ టాబ్లెట్ ధర 3 డాలర్లు ఉంటే.. అక్టోబర్ 1 తర్వాత అది 5 డాలర్లకు పెరిగే ప్రమాదం ఉంది. దీని వల్ల అమెరికా ప్రజలు.. విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ వాడటం మానేసి.. దేశీయంగా తయారయ్యే మందులే వాడే పరిస్థితి రావచ్చు. తద్వారా ఇది భారత్ లాంటి దేశాల్లో మందుల ఉత్పత్తి కంపెనీలకు పెద్ద షాక్ కాబోతోంది. మన దేశం నుంచి భారీ సంఖ్యలో మందులు అమెరికాకు ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలు.. పెద్ద ఎత్తున అమెరికాకు మందులను ఎగుమతి చేస్తాయి. ట్రంప్ నిర్ణయం ఈ కంపెనీలకు పెను శాపం లాంటిదే.
అమెరికాలో మందుల తయారీ ప్లాంట్ నిర్మాణంలో ఉంటే.. అలాంటి కంపెనీలు మందులను దిగుమతి చేసుకుంటే.. వాటికి 100 శాతం టారిఫ్ ఉండదు. అంటే.. భూమిని కలిగివుంది.. ప్లాంట్ నిర్మాణంలో ఉంటే.. ఆ కంపెనీలకు ఈ టారిఫ్ నుంచి మినహాయింపు ఉంది. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో తెలిపారు. “అమెరికాలో మందుల తయారీని ప్రోత్సహించడానికి, విదేశీ మందులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ చర్య తీసుకుంటున్నాం” అని తెలిపారు. ఇది “నేషనల్ సెక్యూరిటీ”కి సంబంధించిన అంశం కూడా అని చెప్పారు.
భారత ఔషధ కంపెనీలకు అమెరికా అతిపెద్ద మార్కెట్. 2024లో భారత్ నుంచి అమెరికాకు $8.73 బిలియన్ల విలువైన మందులు ఎగుమతి అయ్యాయి. ఇది మొత్తం ఔషధ ఎగుమతులలో 31 శాతం. అందుకే ఇప్పుడు భారత్‌ని “ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్” అని పిలుస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో 40 శాతం ప్రెస్క్రిప్షన్లు, 90 శాతం జెనరిక్ మందులు వచ్చేది భారత్ నుంచే. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, లూపిన్, అరబిండో, సిప్లా వంటి కంపెనీలు అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడతాయి. కొన్ని బ్రాండెడ్ మందులను అమెరికా ఫార్మా కంపెనీలతో భాగస్వామ్యంగా ఉంటూ తయారుచేస్తున్నాయి. కాబట్టి 100 శాతం టారిఫ్ వల్ల ధరలు రెట్టింపు అవుతాయి. దీని వల్ల భారత కంపెనీలకు అమెరికా మార్కెట్ షేర్ తగ్గిపోతుంది. దీంతో లాభాలు భారీగా తగ్గుతాయి.
ఈ నిర్ణయం అమెరికా వినియోగదారులకూ షాకే. ఇన్నాళ్లూ వారికి భారతీయ జెనరిక్ మందులు చౌక ధరలకు లభిస్తున్నాయి. హైపర్‌టెన్షన్, మెంటల్ హెల్త్, బర్త్ కంట్రోల్ పిల్స్ వంటి అవసరమైన ఔషధాలు ఇండియా నుంచే వస్తాయి. టారిఫ్ వల్ల ధరలు పెరిగి, ప్రజలపై భారం పడుతుంది. ప్రస్తుతం మందులపై 25 శాతం టారిఫ్ ఉంది. ఇది కూడా ఎక్కువే. దీని వల్ల అమెరికా ప్రజల ఔషధ ఖర్చులు $51 బిలియన్లు పెరిగాయి. ధరలు 13% పెరిగాయి. భారత్, చైనా వంటి దేశాల నుంచి ఇంపోర్ట్‌లను తగ్గించి, USలో తయారీని పెంచాలని ట్రంప్ కోరుకుంటున్నారుయ. కానీ ఇది అంత తేలిక కాదు. మందుల తయారీకి పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కావాలి. నైపుణ్యాలు ఉండాలి. రెగ్యులేషన్లు అవసరం. సో ఇన్నీ జరగడానికి సంవత్సరాలు పడతాయి.
భారత ప్రభుత్వం, ఔషధ కంపెనీలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. “జెనరిక్ మందులు అమెరికాలో చౌక హెల్త్‌కేర్‌కు కీలకం, టారిఫ్ వల్ల రెండు దేశాలూ నష్టపోతాయి” అని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ అన్నారు. టారిఫ్ ప్రకటన వల్ల భారత ఔషధ కంపెనీల స్టాక్‌లు 6% వరకు పడిపోయాయి. ఇక ఇండియా.. అమెరికాపై ఆధారపడటం తగ్గించి.. యూరప్, ఆఫ్రికా మార్కెట్లపై దృష్టి పెట్టాలి. ట్రంప్ ఇతర ఇంపోర్ట్‌లపై కూడా టారిఫ్‌లు విధించారు. ట్రక్‌లపై 25%, కిచెన్ క్యాబినెట్లపై 50%, ఫర్నిచర్‌పై 30% టారిఫ్ వేశారు. 100% tariff on medicines.
ఇప్పటికైతే 100 శాతం సుంకాలు ప్రకటించిన ట్రంప్.. భవిష్యత్తులో మరింత పెంచే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. ఆ సుంకాలు 150% నుంచి 250% వరకు ఉండే అవకాశం ఉంది. ఇక.. అమెరికాలో తయారీ ప్లాంట్లు నిర్మిస్తున్న కంపెనీలకు ట్రంప్ మినహాయింపు ఇచ్చారు. అయితే అమెరికాలో తయారీ ప్లాంట్లు నిర్మిస్తున్న ఉన్న కంపెనీలకు ఈ సుంకాలు వర్తించవని అన్నారు. దీంతో ఇప్పటికే ప్లాంట్లు ఉన్న కంపెనీలకు మినహాయింపు వర్తిస్తుందా అనే విషయంలో స్పష్టత కొరవడింది.