
India’s warning to Pakistan: ఆపరేషన్ సిందూర్.! భారత శక్తి సామర్థ్యాలను ప్రత్యర్థి దేశం పాకిస్థాన్ సహా… ప్రపంచానికి పరిచయం చేసిన యుద్ధం అదీ. భారత్‌తో యుద్ధం అంటేనే..పాకిస్థాన్ పారిపోయేలా యుద్ధాన్ని ముగించింది… భారత సైన్యం. అంతేనా యుద్ధాన్ని ఎలా ముగించాలో కూడా ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ క్రమంలోనే దేశీయ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు..శత్రువులకు గట్టి బుద్ధి చెప్పేందుకు..చర్యలు చేపట్టింది భారత సైన్యం. భవిష్యత్‌లో ఎదురయ్యే ఎలాంటి యుద్ధాల్లో నైనా…ప్రత్యర్థులకు చుక్కలు చూపించేందుకు సిద్ధం అవుతుంది. సుదర్శన చక్ర పేరిట ఏర్పాటు అవుతోన్న భారత ఐరన్ డోమ్..తయారీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇదే విషయాన్ని వాయుసేన అధిపతి వెల్లడించారు. భారత్‌ను శత్రుదుర్బేద్యంగా తయారు చేసేందుకు త్రివిధ దళాలు పని ప్రారభించాయని ఏపీ సింగ్ పేర్కొన్నారు. మరి గగనతల రక్షణ వ్యవస్థను సుదర్శన చక్ర ఎలా కాపాడనుంది.? ఇందుకు త్రివిధ దళాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి.? ఈ తరహా రక్షణ వ్యవస్థలను ఏఏ దేశాలు కలిగి ఉన్నాయి?
యుద్దం ఏ పైపు నుంచి ఏ టైంలో ఎలా వస్తుందో అంచనా వేయడం కష్టమే. పహల్గాం దాడి ఇదే స్పష్టం చేసింది. పక్కా ప్లాన్ తోనే పర్యాటకులపై దాడితో పాకిస్తాన్ యుద్ధానికి కాలు దువ్వింది. ప్రతిగా పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించిన భారత్ కాళ్ల బేరానికి వచ్చేలా దాడులు చేసింది. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎప్పుడు తలెత్తినా సిద్ధంగా ఉండేలా ప్రత్యర్థుల ఆయుధాలను చిత్తు చిత్తుగా చేసేలా ప్రణాళికలు మొదలు పెట్టింది రక్షణ శాఖ.
భారత గగనతల వ్యవస్థను రక్షించేలా రక్షణ రంగంలో స్వాలంబన సాధించేలా సుదర్శన చక్ర తయారు చేస్తోంది భారత సైన్యం. అందుకోసం త్రివిధ దళాలు ఏకమై పనిని మొదలు పెట్టినట్లు వాయుసేన అధిపతి అమర్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. 2035 సంవత్సరం కల్ల ఈ కొత్త భద్రత వ్యవస్థ పనిచేయడం స్టార్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారన్నారు. ఇతర దేశాలతో ఘర్షణలు తలెత్తిన సమయాల్లో వాటిని ఎదుర్కోని పరిష్కరించుకోవాలి అనే విషయాలకు భారత్ ఆదర్శంగా ఉందన్నారు. భవిష్యత్తు భద్రత సవాళ్లను విజయవంతంగా ఎదురకోనేందుకు రక్షణ రంగంలో స్వాలంబన ఇంపార్టెంట్ అని క్లారిటీ ఇచ్చారు. సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ కోసం త్రివిధ దళాలు పనిచేయడం మొదలు పెట్టినట్లు తెలిపారు.
యుద్ధానికి అర్ధం చెప్పిన ఆపరేషన్ సిందూర్ ను చూసి ప్రపంచ దేశాలు నేర్చుకోవాలని ఎయిర్ మార్షల్ చీఫ్ ఏపి సింగ్ తెలిపారు. యుద్దం ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పుడు ముగించాలి అనేదానికి ఆపరేషన్ సింధూర్ ఓ ఎగ్జామ్ పుల్ అని తెలిపారు. స్పష్టమైన లక్ష్యంతో భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించిందని అది నెరవేరానే ఘర్షణను నిలిపి వేసిందని ఏపీ సింగ్ అన్నారు.ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని భారత్ నుంచి నేర్చుకోవాలని సూచించారు.
ఎయిర్ మార్షల్ చీఫ్ ఏపి సింగ్

త్రివిధ దళాల సమిష్టి చర్యలకు ఆపరేషన్ సింధూర్ ప్రతిబింబంఅన్నారు. ఐఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు లక్ష్యాలను సాధించేలా సుదర్శన చక్క పనిని త్రివిధ దళాలు స్టార్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇక ఇదే సమయంలో పాకిస్తాన్ ను సైన్యాధికారి ఉపేంద్ర ద్వివేది తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకును ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని సందేశం పంపారు. భూమిపై ఉండాలనుకుంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాల్సిందేనని స్పష్టం చేశారు. ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు సైనికులు సన్నద్ధంగా ఉండాలన్నారు.
ఉపేంద్ర ద్వివేది

ఇలా పక్కలో బళ్లంలా మారిన పాకిస్తాన్కు స్టాంగ్ బుద్ధి చెప్పడంతో పాటు ఆ దేశం పై మరోసారి యుద్ధం చేయాల్సి వస్తే భారత శక్తి సామర్ధ్యాలను మరోసారి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆయుధాలను ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా రెడిగా ఉండాలనే సుదర్శన చక్రను ప్రతిపాదించారు. ప్రధాని మోదీ దాని తయారీ దిశగా అడుగులు పడగా 2035 నాటికి పూర్తి చేయాలని పనులు ప్రారభించాయిత్రివిధ దళాలు
అసలు సుదర్శన చక్ర అంటే ఏమిటి ప్రత్యరథి దేశలు భారత్ పై దాడులు ప్రారంభించినప్పుడు వాటిని ముందుగానే పసిగట్టి అదే స్థాయిలో వాటిని తిప్పి కొట్టే గగనతల సామర్థ్యమే సుదర్శన చక్ర. భారత గగనతల రక్షణ వ్యవస్థకు రక్షణ కవచం ఇది. యుద్ధ సమయంలో శత్రువు విద్యుత్ గ్రిడ్లు, కమ్మూనికేషన్ నెట్వర్క్, ఆహార నీటి సరఫరా, వైద్య పరిరక్షణ, రైల్వే స్టేషన్లు, రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగే ఛాన్స్ ఉంది. ఇక ఆ సమయంలో వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పహల్గాలో అమాయక పౌరులను ఊచకోత కోసిన ఉగ్రవాదుల భరతం పట్టేందుకు మే నెలలో ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ పాక్ లోని ముష్కర ముటాల స్థావరాలు వైమానిక శిబిరాలపై దాడి చేసిన సంగతి తెలిసినదే. ప్రతిగా పొరుగు దేశం స్వల్ప శ్రేణి పతావన్ పతా 2క్షిపణలు రాకెట్లు డ్రోన్లను భారత్ పైకి భారీగా ప్రయోగించింది. కానీ వీటిని భారత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. దానికి మరింత మెరుగైనదే సుదర్శన చక్ర.
భారత్ వద్ద ఇప్పటికే ఇంటి గ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టం ఐఏసీసీఎస్ ఉంది. ఆపరేషన్ సింధూర్ లో పాక్ దాడులను తిప్పి కొట్టడంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ రియల్ టైం గగనతల రక్షణ ఆదేశిక వ్యవస్థ. ఇందులో వివిద సెన్సార్లు, రాడార్లు ఆయుధ వ్యవస్థలను అనుసంధానం చేశారు. ఇది భారత గగనతలంపై నిరంతర నిఘాతో ఎప్పటికప్పుడు సమగ్ర చిత్రం ఆవిష్కరించిది. భూతల, గగనతల, నౌకాదళ ఆయుధ వ్యవస్థల మధ్య సమన్వయానికి వీలు కల్పిస్తుంది. ఈ వ్యవస్థను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీఈఎల్ అభివృద్ధి చేసింది. అత్యంత వేగవంతమైన వైమానిక దళ నెట్వర్క్ తో పనిచేస్తుంది. దీంతో వివిధ సెన్సార్లు, యుద్ధ విమానాలు, ఆకాస్, బరాక్ ఎఆర్ సామ్ ఎస్ 400 వంటి క్షిపణి వ్యవస్థలకు సైన్యాధికారులకు మధ్య డేటా వేగంగా సరఫరా చేస్తుంది. అయితే సుదర్శన్ చక్రాలో భాగంగా ఐఏసీసీ ఎస్ ను మరింత బలోపేతం చేసి దానికి ప్రతి దాడి సామర్థ్యం జోడించే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా శత్రువు పై ఖచ్చితత్వంతో దాడి చేయగల దీర్ఘ శ్రేణి క్షిపుణులను దీనికి అనుసంధానిస్తారని విశ్లేషిస్తున్నారు. దీనివల్ల ఆత్మ రక్షణతో పాటు ఎదురుదాడికి వీలు కల్పించే శక్తివంతమైన నెట్ వర్క్ సిద్ధమవుతుంది. India’s warning to Pakistan.
అయితే ఇది ఇజ్రాయెల్ కు చెందిన ఐరన్ డోమ్ వ్యవస్థ కన్నా మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే విస్తృత స్థాయి గగనతల రక్షణ వ్యవస్థ కోసం డిఆర్డీ ఓ ఇప్పటికే ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఇది ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల దీర్ఘ శ్రేణి క్షిపణ వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. 2028 నుంచి 2030 మధ్య దీన్ని సిద్ధం చేయాలన్నది లక్ష్యం. అయితే క్షిపణి పరీక్షలు ఈ ఏడాది చివరిలోగా ప్రారంభం కావచ్చు. 150,250, 400 కిలోమీటర్ల దూరంలో శత్రుక్షిపణులు యుద్ధవిమానాలను ఈ వ్యవస్థ ధ్వంసం చేస్తుంది. అయితే సుదర్శన్ చక్ర దీనికి నెక్ట్స్ విస్తరణ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.