రెమ్యునరేషన్ లో ప్రభాస్ ను బీట్ చేసిన బన్నీ..!

Spread the love

Allu Arjun Prabhas: పుష్ప 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం తొలిరోజునే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుని, రూ. 290 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారతీయ సినీ పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ స్థాయి అనూహ్యంగా పెరిగి, పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా… ఇంటర్నేషనల్ అన్న డైలాగ్‌కు తగ్గట్టుగా ఆయన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. పుష్ప 2లో తన అద్భుతమైన నటన, యాక్షన్, భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన అల్లు అర్జున్‌కు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడింది.

దీంతో, అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ తన పారితోషికాన్ని కూడా భారీగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో చేయబోయే హాలీవుడ్ స్థాయి సినిమా కోసం రూ. 175 కోట్లు తీసుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వార్త విని ఇతర హీరోలు ఆశ్చర్యపోతున్నారట. అల్లు అర్జున్ స్టార్‌డమ్‌కు తగ్గట్టుగానే నిర్మాతలు ఈ భారీ పారితోషికం చెల్లించడానికి సిద్ధమయ్యారని సమాచారం.

సాధారణంగా నటీనటులు లేదా దర్శకులు తమ రెమ్యునరేషన్ వివరాలను అధికారికంగా వెల్లడించరు. అయినప్పటికీ, సినీ వర్గాల్లో వినిపించే మాటలు, టీమ్ నుండి లీక్ అయ్యే సమాచారం ఆధారంగా బడ్జెట్, పారితోషికాల వివరాలు బయటకి వస్తుంటాయి. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే విధంగా రూ. 175 కోట్లు తీసుకుంటున్నారని అంటున్నారు. ఇది నిజమైతే, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, రజనీకాంత్, ప్రభాస్ వంటి అగ్ర నటుల సరసన అల్లు అర్జున్ కూడా అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలుస్తారు. కొంతమంది నటులు సినిమాకు ఇంత అని పారితోషికం తీసుకుంటే, మరికొంతమంది కాల్షీట్‌కు ఛార్జ్ చేస్తారు. ఇంకొందరు నిర్మాణంలో భాగస్వాములై లాభాల్లో వాటా లేదా ఏరియా రైట్స్ తీసుకుంటారు. Allu Arjun Prabhas.

ప్రస్తుతం అల్లు అర్జున్ భారీ పారితోషికం ఛార్జ్ చేస్తున్నారనే వార్తల ప్రకారం, టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా ఆయన అగ్రస్థానంలో నిలిచినట్టే. ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ చిత్రం ‘AA 22’ బడ్జెట్ రూ. 700 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో బన్నీ పారితోషికానికి రూ. 175 కోట్లు, గ్రాఫిక్స్ కోసం రూ. 250 కోట్లు కేటాయించారని, మిగిలిన రూ. 250 కోట్లు దర్శకుడు, హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్స్, నిర్మాణ ఖర్చులకు ఉపయోగిస్తున్నారని అంటున్నారు. ఈ వివరాలు ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం అల్లు అర్జున్ భారీ పారితోషికం, బడ్జెట్ వివరాలు వైరల్ అవుతున్నాయి.