మెగాస్టార్ తో ఇద్దరు యంగ్ హీరోయిన్స్..!

Spread the love

Bobby and Chiru Combo: ఏడు పదుల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు ప్రకటిస్తూ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ జానర్‌లలో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో చిరంజీవి పాల్గొంటున్నారు, ఇది వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

‘మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత చిరంజీవి తన బ్లాక్‌బస్టర్ హిట్ ‘వాల్తేరు వీరయ్య’ అందించిన దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) తో మరో సినిమా చేయనున్నారు. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిరంజీవి అద్భుత విజయాన్ని సాధించింది. ఆ చిత్రం కేవలం మూడు రోజుల్లో రూ. 108 కోట్ల గ్రాస్ వసూలు చేసి, లాంగ్ రన్‌లో రూ. 236 కోట్ల రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు ఇదే హిట్‌ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దర్శకుడు బాబీ, చిరంజీవి 158వ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి సరసన ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరూ రాశి ఖన్నా, మాళవిక మోహనన్ అని వార్తలు వస్తున్నాయి. బాబీ ఇప్పటికే వీరిద్దరిని సంప్రదించారని, వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. Bobby and Chiru Combo.

ప్రస్తుతం రాశి ఖన్నా పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో నటిస్తుండగా, మాళవిక మోహనన్ ప్రభాస్ ‘ది రాజాసాబ్’లో భాగమై ఉంది. ఈ క్రమంలో చిరంజీవి చిత్రంలో అవకాశం దక్కితే, వీరిద్దరి కెరీర్‌కు మరింత బూస్ట్ లభించే అవకాశం ఉంది. ఈ ‘మెగా 158’ చిత్రం పూజా కార్యక్రమాలను నవంబర్ 5 న అట్టహాసంగా నిర్వహించనున్నారు. షూటింగ్ డిసెంబర్ లేదా జనవరి మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఒక ఫుల్ మాస్ ఫ్లెడ్జ్డ్ సబ్జెక్ట్‌గా రూపొందనుంది. ‘వాల్తేరు వీరయ్య’ను మించిన కమర్షియల్ అంశాలతో పాటు, చిరంజీవిని ఇంతవరకూ చూడని సరికొత్త మాస్ యాంగిల్‌లో బాబీ చూపించబోతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.