
Telusu Kadha Review:నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ,రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల
దర్శకత్వం: నీరజ కోన
సంగీతం: SS తమన్
ఎడిటింగ్ : నవీన్ నూలి
విడుదల తేది: అక్టోబర్ 17, 2025
యంగ్ హిరో సిద్ధు జొన్నలగడ్డ కు టాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ అంతఇంత కాదు. ఆ క్రేజ్ తోనే వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. హిట్ ప్లాప్ ల తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. సిద్దు హిరోగా నటించిన తాజా చిత్రం “తెలుసు కదా”. లేడీ డైరెక్టర్ నీరజ కోన దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, ఆమె కూతురు కలిసి నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. సినిమాపై అంచనాలను కూడా పెంచాయి. ఈ క్రమంలో మూవీ టీం దీపావళి కానుక గా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చింది.ఇంతకీ తెలుసు కదా సినిమా ఎలా ఉంది..? హిట్టా..? ఫట్టా..? తెలుసు కదా తో సిద్దు మరో హిట్ ను తన ఖతాలో వేసుకున్నారా..? అనేది మెగా9 రివ్యూలో తెలుసుకుందాం.Telusu Kadha Review
తెలుసు కదా మూవీ స్టోరీ విషయానికి వస్తే.. హిరోకు.. మగవారి చేతిలోనే పవర్, కంట్రోల్ ఉండాలని నమ్మె వ్యక్తి. అలాంటి హిరోకు రాశికన్నా,శ్రీనిధి శెట్టి ఒకేసారి ప్రేమలో పడతారు. ఇద్దరినీ పెళ్లి చేసుకుని కలిసి జీవించాలి అనుకుంటాడు. అదే సమయంలో స్టోరీ ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ ఎలా టర్న్ అయ్యింది…? ప్రేమ,పెళ్లి వంటి ఎమోషన్స్ హిరో జీవితంలో ఎలాంటి జ్ఞాపకాలు మిగిల్చాయి..? ఇద్దరిని పెళ్లి చేసుకున్నారా..? అనేది తెలియాలంటే థియేటర్స్ కు వెళ్లి తెలుసుకదా సినిమా చూడాల్సిందే.
ఇక సినిమాను విశ్లేషణపరంగా చూసుకుంటే.. ఆడవాళ్లను తమ కంట్రోల్ లో పెట్టుకోవాలని భావించే హిరో ఒకేసారి ఇద్దరితో ప్రేమలో పడడం, ఆ తర్వాత నడిచే రోమాన్స్, హర్షతో కామెడీతోనే ఫస్టాప్ అంతా ఉంటుంది. ఇంటర్వేల్ తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతోంది. బోల్డ్ అండ్ ఎమోషనల్ స్టోరీ తో సాగుతోంది. క్లైమాక్స్ నొప్పి తెలియకుండా దెబ్బ కొట్టినట్లు ఉంటుంది. ఈ సినిమాలో ఇంటెన్స్ ఎమోషన్స్, మోడ్రన్ రిలేషన్షిప్స్ పై కొత్త యాంగిల్, సిద్ధు డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వైవా హర్ష కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్వించగా, సిద్ధు చెప్పిన కొన్ని డైలాగ్స్ యువతకు బాగా కనెక్ట్ అవుతాయి. హీరో సిద్ధు, హీరోయిన్లు రాశీఖన్నా, శ్రీనిధి శెట్టిల మధ్య లవ్ ట్రాక్ బలంగా ఉంటుంది. సినిమా చాలా బోల్డ్ గా, రొమాంటిక్ గా ఉంటుంది. ఇందులో రొమాన్స్ అండ్ కామెడీనే హైలైట్ గా ఉంటుంది. లవ్ ట్రాక్ విషయాలు చాలా కొత్తగా, ట్రెండీగా కనిపిస్తాయి. డైరెక్టర్ నీరజ హిరో క్యారెక్టర్ చూపించిన విధానం బాగుంది. సినిమా మొత్తం చాలా బ్యాలెన్స్డ్ గా చేశారు. జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎస్. థమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ కి తగ్గట్టుగా ఉంది. ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ వర్క్ బాగుంది. ఓవరాల్ గా లవ్, మేల్ ఈగో, మోడర్న్ రిలేషన్ షిప్స్, ఎమోషన్స్ మిక్స్ చేసిన మూవీ “తెలుసు కదా”.
నటీనటులు ఫర్మామెన్స్ విషయానికి వస్తే.. హిరో సిద్దు వన్ మ్యాన్ షో చేశారని చెప్పాలి. చాలా బాగా నటించారు. పాత్రలో ఒదిగిపోయారు. బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీ, డైలాగ్ డెలివరీ అదిరిపోయాయి. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నాలతో సిద్ధు కెమిస్ట్రీ అద్భుతంగా వుంది. వైవా హర్షా తన కామెడీ ఇమేజ్ కి భిన్నంగా, డిఫరెంట్ ఫ్రెండ్ పాత్రలో మెప్పించారు. మిగతా తారంగణం అంతా తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. తెలుసు కదా సినిమాకు హిరో యాక్టింగ్,డైరెక్షన్, మ్యూజిక్ అండ్ బీజీఎం, హిరోయిన్స్ యాక్టింగ్ ప్లస్ పాయింట్స్ కాగా.. ఓవర్ రోమాన్స్ మైనస్ అని చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే “తెలుసు కదా” రోమాంటిక్ డ్రామా. ఎమోషన్స్, లవ్ ట్రాక్, సిద్ధు పాత్ర కనెక్ట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే.