
Nagarjuna’s King 100: అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంతో బిజీగా ఉన్నారు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ ప్రాజెక్ట్‌కు కోలీవుడ్ దర్శకుడు ఆర్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నాగార్జున సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయంపై కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
మొదటగా, నాగ్ పక్కన బాలీవుడ్ నటి టబు నటిస్తుందనే వార్త బలంగా వినిపించింది. అయితే, అనారోగ్య కారణాల వల్ల టబు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. దీంతో, ఆ స్థానంలో మరో హీరోయిన్‌ను వెతికే పనిలో మేకర్స్ పడ్డారు. కొందరు నయనతారను తీసుకుంటారని భావించారు, ఎందుకంటే గతంలో వీరిద్దరూ ‘బాస్’, ‘గ్రీకు వీరుడు’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. కానీ, తాజాగా చిత్ర బృందం నయన్ స్థానంలో మరొక హీరోయిన్‌ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు, స్వీటీ అనుష్క శెట్టి.
అనుష్కను సినీ పరిశ్రమకు పరిచయం చేసిందే నాగార్జున. వీరిద్దరూ గతంలో ‘సూపర్’, ‘రగడ’, ‘డమరుకం’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ హిట్ జోడీ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైనట్లే.
సినిమా వర్గాల సమాచారం ప్రకారం, ‘కింగ్ 100’లో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు. వారిలో ఒకరిగా అనుష్క పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, మిగిలిన ఇద్దరు హీరోయిన్ల గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయనున్నారు. యాక్షన్, ఫ్యామిలీ అంశాలు మేళవించిన కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఎటువంటి ఆర్భాటం లేకుండా ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. Nagarjuna’s King 100.
నాగార్జున, అనుష్క శెట్టి కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అనుష్క మొదటి సినిమా ‘సూపర్’ లో నాగార్జున హీరో. ఆ తరువాత వీరిద్దరూ ‘డాన్’, ‘ఢమరుకం’, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘ఊపిరి’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. వీరి చిత్రాలు విజయాలు సాధించడమే కాక, వీరి కెమిస్ట్రీకి మంచి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో, నాగార్జున వందో చిత్రంలో అనుష్క నటిస్తుందనే వార్త అక్కినేని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. “నాగార్జున – అనుష్క కాంబో అంటే హిట్ గ్యారెంటీ” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ వార్తలపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.