
Pakistan Tomoto Price: ఇప్పుడు టమాటా ఒక విలాస వస్తువుగా మారిపోయింది. ఒకప్పుడు అందరి వంటింట్లో సులభంగా దొరికే టమాటా, ఇప్పుడు ప్రజల జేబులను ఖాళీ చేస్తోంది. ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ పరిస్థితి పాకిస్తాన్ ప్రజల జీవితాన్ని మరింత కష్టతరం చేసింది.
దాయాది దేశం పాకిస్థాన్ లో కూరగాయలు, నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్కడ ద్రవ్యోల్బణం శివతాండవం చేసినట్లు రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ప్రజలు కనీస ఆహార పదార్ధాలు కొనుక్కోవటం కూడా కలగా మారిపోతోంది. కూరగాయలు కూడా లగ్జరీ వస్తువుల్లా మారిపోవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అక్కడ కేజీ టమాటా రేటు ఏకంగా రూ.600 పలుకుతోంది. అంటే ఒక్కో టమాటా రేటు దాదాపు 75 పాకిస్థానీ రూపాయలకు చేరింది.
పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం చరిత్రలోనే అత్యంత స్థాయికి చేరింది. సాధారణ ఆహార పదార్థాల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక కిలో టమాటాలు రూ.600కి అమ్ముడవుతున్నాయి. కేవలం ఒక నెలలోనే 400 శాతం పెరుగుదల నమోదైంది. దీని వల్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది.
పార్లమెంట్‌లో కూడా ఈ విషయంపై పెద్ద చర్చ జరిగింది. కొంతమంది సభ్యులు “టమాటాలు కొనడానికి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది” అని వ్యంగ్యంగా మాట్లాడారు. మరికొందరు “ఒకప్పుడు భారత్ నుంచి చవకగా టమాటాలు దిగుమతి చేసుకునేవాళ్లం” అని పాత రోజులను గుర్తుచేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఒక పాకిస్తాన్ ఎంపీ తన చేతిలో ఒక టమాటా పట్టుకుని “ఈ టమాటా ఇక్కడికి తీసుకురావడం చాలా కష్టం అయింది. ఫరూఖ్ సాహబ్ సహాయం చేయకపోతే ఇది సాధ్యం కాకపోయేది. ఈ టమాటా ధర రూ.75” అని చెప్పినట్టు కనిపించింది.
పాకిస్థాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం అక్కడి పౌరులలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. టమోటా ధర కిలోగ్రాముకు రూ.600కి చేరింది. ఇది దాదాపు 400% పెరుగుదలను సూచిస్తుంది. ఈ పరిస్థితులు ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఇక ఈ సమస్య పార్లమెంటులో గందరగోళ పరిస్థితులకు దారితీసింది. టమాటాలు కొనడానికి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంపీలు వ్యంగ్యంగా స్పందించారు. ‘టమోటా రుణాల’ కోసం డిమాండ్ చేశారు.
అక్టోబర్ 11 నుంచి పాకిస్థాన్ -ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో భారీ ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ వైమానిక దాడుల కారణంగా సరిహద్దులు మూతపడ్డాయి. దీంతో ధరలు పెరిగాయని భావిస్తున్నారు. సరిహద్దు మూసివేత 2,600 కిలోమీటర్ల సరిహద్దులో వాణిజ్యాన్ని నిలిపివేసిందని.. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని చెబుతున్నారు. పాక్-ఆఫ్ఘన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ ప్రకారం.. ప్రతిరోజూ, రెండు దేశాలు దాదాపు 1 మిలియన్ డాలర్లు నష్టపోతున్నాయన్నారు.
నిలిచిపోయిన వార్షిక వాణిజ్యం 23 బిలియన్ డాలర్లు, ఇందులో తాజా పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, మందులు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు ఉన్నాయి. దీని ఫలితంగా పాకిస్థాన్ లో ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా కిలో టామోటా ధరల రూ.600కి పెరిగింది. ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. వెల్లుల్లి ఇప్పుడు కిలోకు రూ.400, అల్లం రూ.750, ఉల్లిపాయలు రూ.120, బఠానీలు రూ.500, క్యాప్సికమ్, బెండకాయ రూ.300, దోసకాయ రూ.150, స్థానిక క్యారెట్లు రూ.200, నిమ్మకాయలు రూ.300 చొప్పున పెరిగాయి.
నిపుణుల అంచనాల ప్రకారం, ఈ సరిహద్దు మూసివేత వల్ల రెండు దేశాలు రోజుకు దాదాపు ఒక మిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. రెండు దేశాల మధ్య ప్రతి సంవత్సరం సుమారు 23 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు రవాణా అవుతాయి. అందులో తాజా కూరగాయలు, మందులు, ధాన్యాలు, పంచదార, మాంసం, పాల ఉత్పత్తులు ఉన్నాయి. భారత్ నుంచి దిగుమతులు నిలిచిపోయిన తర్వాత పాకిస్తాన్ టమాటాల కోసం ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్‌పై ఆధారపడుతోంది. కానీ ఇప్పుడు ఆ సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిన్నది. Pakistan Tomoto Price.
పాకిస్తాన్ వ్యాప్తంగా కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం, వెల్లుల్లి రూ.400 కిలో, అల్లం రూ.750 కిలో, బటానీలు రూ.500 కిలో, ఉల్లిపాయలు రూ.120 కిలో. చిన్న కొత్తిమీర కట్ట కూడా ఇప్పుడు రూ.50కి అమ్ముతున్నారు. జీవన వ్యయం పెరుగుతుండటం ప్రతి కుటుంబాన్ని వేధిస్తోంది.
పాక్ ఆఫ్గన్ బోర్డర్ మూసివేత కారణంగా టమాటా రేట్లకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయని తేలింది. పాక్ ఆఫ్గన్ పై వైమానిక దాడులు చేసిన తర్వాత అక్టోబర్ 11 నుంచి బోర్డర్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో దిగుమతులు తగ్గి టమాటాలకు కొరత ఏర్పడింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోవటంతో రోజుకు మిలియన్ డాలర్ల వరకు వ్యాపారం నిలిచిపోయి నష్టం జరుగుతోందని తెలుస్తుంది. రెండు దేశాలు ఈ బోర్డర్ ద్వారా ఏటా 23 బిలియన్ డాలర్ల వరకు వ్యాపారం చేస్తుంటాయని తేలింది. దీంతో నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు వీటిని కొనుగోలు చేసేందుకు కష్టతరంగా మారింది. ప్రజలు కడుపునిండా మూడుపూటలు తినేందుకు కూడా నోచుకోవడం లేదు.