
Antarvedi temple Mystery: మొంథా రాకాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. భారీ వర్షాలతో నదులు , వాగులు పొంగిపొర్లి ఉగ్ర రూపం దాల్చి వందలాది ఎకరాల్లో పంటలను దెబ్బతీశాయి. ప్రకృతి సృష్టించిన ఈ భయంకరమైన బీభత్సానికి ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు. మోంథా ధాటికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది . తీర ప్రాంతాలు ఉన్న ప్రతి చోట మొంథా ప్రళయంలా విరుచుకుపడింది. కానీ..మొంథా తుపానుకు సైతం అక్కడ ఎంట్రీ లేదా? ఎన్ని భయంకరమైన తుపానులు వచ్చినా ఆ తీరాన్ని కనీసం టచ్ చేయనేలేవా? ఆ సముద్ర తీరానికి అంతటి ప్రత్యేకత ఏంటి? ప్రకృతి వైపరీత్యాలు సైతం పక్కకు తప్పుకుంటున్నాయి ఎందుకు? సముద్రతీరాన ఉన్న ఆలయం అక్కడి ప్రజల రక్షణకు కవచంగా మారిందా? స్వామివారి కనుచూపే కాపుకాస్తోందా? లేదా సముద్ర తీరం ఆకారం ఆపదను అడ్డుకుంటోంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే అతలాకుతలం చేసిన భయంకరమైన రాకాసి తుపాను మొంథా నుంచి అంతర్వేది ఎలా బయటపడింది? అక్కడి వరకు వచ్చిన మొంథా తన డైరెక్షన్ ను ఎందుకు డైవర్ట్ చేసుకుంది. ఏంటా మిస్టరీ.
వశిష్ట గోదావరి సముద్రం సంగమించే ప్రాంతం అంతర్వేది. అంతర్వేదిలో అంతు చిక్కని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. నరసాపురానికి సమీపంలో గల ఈ త్రికోణ ఆకారపు దీవిపై సముద్ర ముఖంగా లక్షీ నారసింహ స్వామి పురాతన ఆలయం ఉంది. ఈ ఆలయానికి సముద్రానికి మధ్యలో ఓ ధ్వజస్తంభం ఉంది. ఆ ధ్వజస్తంభాన్ని సముద్రం ఎప్పటికీ దాటి వెళ్లలేదనేది ఇక్కడి స్థానికుల నమ్మకం. లక్ష్మీ నరసింహస్వామి గీసిన ఈ గీతను సముద్రు కూడా దాటలేడని ప్రజల విశ్వాసం.అందుకు మొంథా తుపాను ప్రత్యక్ష ఉదాహరణ అని అంటున్నారు అంతర్వేది ప్రజలు. మొంథా తుపాను మొదట అంతర్వేది పాలెంను తాకి అక్కడి నుంచి పశ్చిమ దిశగా వెళ్లి నరసాపురంలో తీరం దాటింది. గతంలో దివిసీమ ఉప్పెన సమయంలో కూడా ఇదే జరిగింది. అంతర్వేది నుంచి దివిసీమ వైపునకు తుపాన్ డైవర్ట్ అయ్యింది . కోనసీమ తుపాన్ సమయంలోనూ కాకినాడ దగ్గరికి వెళ్లిన తుపాన్ అది అంతర్వేది దగ్గర తీరం దాటలేకపోయింది. దీనికి శాస్త్రీయ కారణం ఉందా? అక్కడ సముద్రం యూ షేప్ లో ఉండటం వల్లనే ఇలా జరుగుతోందా? తుపాను తీరం తాకిన ఆ తర్వాత అటో ఇటో వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది ? మొంథా తుపాను నేపథ్యంలో మరోసారి ఈ అంశం అంతర్వేదిలో హాట్ టాపిక్ గా మారింది.
అంతర్వేదిలో బియ్యపు తిప్ప అన్నా చెల్లెళ్ల గట్టు నుంచి భైరవపాలెం గాడి మొగ్గ వరకు ఒక్కసారి కూడా తుపాన్ తీరం దాటలేదంటే ఆశ్చర్య కలుగక మానదు. వీటి మధ్యనే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రకృతి వైపరీత్యాలు ఈ నేలను తాకవని గోదావారి జిల్లా ప్రజల నమ్మకం. 1996లో ఒక తుపాన్ అంతర్వేది దగ్గర తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరానికి దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. 240 కిలో మీటర్ల వేగంతో కాకినాడ , కోనసీమలను అల్లాడించిన ఆ తుపాన్ అంతర్వేదిని కాదని కాకినాడకు దక్షిణవైపునకు తన దిశను మార్చుకుని 50 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడి తీరాన్ని దాటింది.

1977లో మరో తుపాను అంతర్వేది సమీపంలోనే తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తుపాను సైతం సునామీగా మారి దివిసీమపై విరుచుకుపడింది. మొంథా తుపాను కూడా కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను వేగాన్ని తగ్గించుకుని ముందుగా అంతర్వేదిపాలెం దగ్గర తీరాన్ని టచ్ చేసి అక్కడే తీరం దాటుతుందని అంతా భావించారు. కానీ విచిత్రంగా మొంథా తన డైరెక్షన్ ను మార్చేసుకుంది. నర్సాపురం సమీపంలోని పాతపాడు వద్ద తీరం దాటింది. ఆ లక్ష్మీ నరసింహస్వామే మరోసారి తమను రక్షించాడంటూ అంతర్వేది ప్రాంత ప్రజలు తెలపడం గమనార్హం. Antarvedi temple Mystery.
అయితే తుపాను అక్కడ తీరం దాటకపోవడానికి సముద్ర ఆకారమే కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇండియా మ్యాప్ లో చూస్తే ఆ ప్రాంతం యూ ఆకారంలో సముద్ర తీరం లోపలికి ఉంటుంది. అటువైపు ఇటువైపు భూమి సముద్రంలోనికి ఉండటం వల్ల తుపాను ఆ ప్రాంతాన్ని తాకలేకపోతుందని సైన్స్ చెబుతోంది. అయితే గ్రామస్థుల నమ్మకాన్ని తప్పుబట్టలేము. ఎందుకంటే సైన్స్ కి అందని విధంగా ప్రకృతి విపత్తులు ఉంటాయి. ప్రకృతి విలయాలను అత్యంత ఖచ్చితంగా పసిగట్టడం కానీ ఖచ్చితంగా అంచనా వేయడం కానీ ఇప్పుడున్న సైన్స్ టెక్నాలజీకి సాధ్యం కాదు. సైన్స్ కి మించిన శక్తి అంతర్వేదిలో ఉందంటున్నారు ప్రజలు.