అడ్డంగా దొరికిపోయారా?

Spread the love

Chevireddy Bhasker Reddy Liquor Scam: చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలిందా. చంద్రగిరిలో ఆయన నిర్మించుకున్న చెవిరెడ్డి కోట బద్దలైందా. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇక భూస్థాపితమేనా అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. లిక్కర్ కేసులో రాష్ట్రం విడిచిపెట్టి బెంగళూరు నుంచి విదేశాలకు పారిపోతున్న సమయంలో బెంగళూరు పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఏపీ సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. చెవిరెడ్డి అరెస్టు అయిన తర్వాత నుంచి కోర్టుకి, కోర్టు నుంచి జైలుకి, జైలు నుంచి కోర్టుకి వెళ్లే సమయంలో ఆయన మాటలు వింటే ఆయన ఎంత అమాయకుడు అని అందరూ భావిస్తారు. కానీ అసలు విషయం ఆ కేసులో ఏ 34గా అయిన వెంకటేష్ నాయుడు వీడియో రికార్డులతో బయటపడింది. ఇక వెంకటేష్ నాయుడు దగ్గర ఉన్న అన్ని వీడియోలు బయటపడితే చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి రాజకీయ జీవితంతో పాటు కొడుకు మోహిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా భూస్థాపితమైనట్టే అని రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.

తాను మద్యం వ్యాపారానికి దూరం, మద్యం కుంభకోణంతో తనకు ఎటువంటి సంబంధం లేదు.. మద్యం వల్లనే మా ఇంటిలో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయాను…అలాంటి వాటి వల్ల వచ్చే ఆదాయానికి దూరమంటూ మాట్లాడే చెవిరెడ్డికి బిగ్ షాక్ తగిలినట్లయింది. ఇప్పటికే బయటకు వచ్చిన వీడియోతో మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి, ఆయన అనుచరులదే కీలక పాత్ర అని సిట్ అంటుంది. మద్యం కుంభకోణంపై లోతైన దర్యాప్తు చేసిన అధికారులు పక్కా ఆధారాలతోనే అందరిని జైలు పాలు చేస్తున్నారని జనం మాట్లాడుకుంటున్నారు. మద్యం కుంభకోణంపై విచారిస్తున్న సిట్..తాజాగా చెవిరెడ్డి సన్నిహితుడు అయిన వెంకటేష్ నాయుడు ఎంచుతున్న డబ్బులు కట్టల విజువల్స్ బయటకు రావడంతో చెవిరెడ్డికి బిగ్ కిషాక్ లాంటిదని అంటున్నారు.

వెంకటేష్ నాయుడు వీడియో బయటకి రావడం కూడా చెవిరెడ్డిని సైలెంట్ చేయడానికేనా అన్న టాక్ కూడా నడుస్తోంది. దీంతోపాటు వైయస్సార్సీపీలో ఎగిరెగిరి పడుతున్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో పాటు వైయస్సార్సీపి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి కూడా భారీ షాక్ తగిలేలా చేశాయట ఆ వీడియోలు. ఈ ఒక్క వీడియోనే కాదు ఇంకా ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయనీ, అలాంటివన్నీ బయటకు వస్తే ఇన్ ఫ్రెంట్ క్రోక డైల్ ఫెస్టివల్ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ కుంభకోణం కేసులో బెంగుళూరు నుంచి విదేశాలకు పారిపోతున్న సమయంలో సిట్ ధికారులు అరెస్టు చేశారు. అయితే సిట్ అధికారులు అరెస్టు చేసి తీసుకెళుతున్న సమయంలో మీడియా ముందు తనకు ఎటువంటి పాపం తెలియదని, నిజం నిలకడ మీద బయటకు వస్తుందంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చే జరిగింది. నిజంగా చెవిరెడ్డి అమాయకుడన్న స్థాయిలో ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే చెవిరెడ్డి చిన్ననాటి స్నేహితుడు,హైదరాబాద్ రియల్టర్ చెరుకూరి వెంకటేష్ నాయుడి వ్యవహారం బయటకు వచ్చింది. Chevireddy Bhasker Reddy Liquor Scam.

లీక్ అయిన వీడియోని చూస్తే వెంకటేష్ నాయుడు మద్యం స్కాంలో కీలక సూత్రధారి అని తేలిపోయిందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ నాయుడుని జూన్లో అరెస్టు చేసి ఏ 34గా లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టు చూపారు సిట్ అధికారులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు దేశం వదిలిపోతుండగా బెంగుళూరు విమానాశ్రయ పోలీసులు ఇచ్చిన సమాచారంతో వారిని ఏపీ సిట్ అదుపులోకి తీసుకుంది. చెవిరెడ్డిని అరెస్ట్ చేసినప్పటి నుంచి చెవిరెడ్డి నోటా శ్రీరంగ నీతులే వినపడుతున్నాయి. అసలు మద్యం అంటే అతనికి గిట్టదని..మద్యం కేసులో తమకు సంబందం లేదని అంటున్నారు. కానీ ఒక్కోసారి బెదరింపులు, ఒక్కోసారి గంభీరం, మరోసారి మౌనం ఇలా చెవిరెడ్డి విశ్వరూప నటన ముందు కమలహాసన్ కూడా తక్కువే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయట.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరుపున రియల్ ఎస్టేట్ వ్యవహారాలను హైదరాబాద్ లో వెంకటేష్ నాయుడు చక్కదిద్దే వాడని సమాచారం. దీనికితోడు తాడేపల్లి జగన్ నివాసంలో 2022లో సంక్రాంతి నాడు తిరుమల దేవస్థానం సెట్టింగ్ వేసి సంబరాలు నిర్వహించారు. ఈసంబరాలలో కూడా వెంకటేష్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీంతో అతని ఫేస్ బుక్ అకౌంట్లో ఫొటోలు కూడా ఉన్నాయి. అందులో వైసిపి నాయకులతో సన్నిహితంగా ఉన్న పోటోలు, నటి తమన్నాతో ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్లో వెళుతున్న ఫోటోలు ఉన్నాయి. చివరకు లక్ష్మి పార్వతి ఫొటోలతో సహా ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి సైతం వెంకటేష్ మంది మార్బలంతో వచ్చినప్పుడు అక్కడ అధికారులు రాచమర్యాదుల చేసేవారట. దీంతో పాటు చెవిరెడ్డికి ఆత్మగా వెంకటేష్ నాయుడు కీలకంగా ఉన్నట్లు అర్థం అవుతోందట.

వారం క్రితం వ్యక్తిగత కక్షతోనే పెద్దిరెడ్డితో కాలేజి రోజుల్లో ఉన్న గొడవలను మనుసులో పెట్టుకుని మిథున్ రెడ్డిని అక్రమంగా కేసులలో ఇరికించారని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి కూడా వెంకటేష్ నాయుడు వీడియోలు దిమ్మదిరిగే విధంగా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో అయనను వెంకటేష్ నాయుడు కలుసుకున్నట్లు కూడా సమాచారం. ఆసమయంలో జగన్ మోహన్ రెడ్డి అర్థిక వ్యవహారాలను వెంకటేష్ టీమ్ పర్యవేక్షించి, చక్కదిద్దినట్లు తెలుస్తోంది. దీనికితోడు తన ఇంట్లో మద్యం, డబ్బు దాచిపెట్టడానికి అడ్డాగా ఉంచాడని అంటున్నారు. అయితే ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్లో నంద్యాల్లో వెంకటేష్ నాయుడు అడ్రస్ చూపిస్తోంది. మిగతా ఎక్కడా కనిపించడం లేదు.

ఏపి వైసిపి నాయకులకే కాదు తెలంగాణ బిఅర్ఎస్ నాయకులతో కూడా వెంకటేష్ నాయుడు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. బిఅర్ఎస్ పార్టీకి చెందిన ఓ పెద్ద నేతకు గతంలో హిందు పత్రికలో సైతం వెంకటేష్ నాయుడు 10 లక్షల వ్యయంతో యాడ్ వేసినట్లు తెలుస్తోంది. ఇక నిత్యం ఆ నేతతో టచ్ లో ఉండటమే కాకుండా చెవిరెడ్డి సర్వే బృందానికి తెలంగాణ, ఎపిలో అవసరమైన నిధుల వ్యవహారం చూసేవాడని సిట్ దర్యాప్తులో బయటపడింది. మొత్తం మీదా మద్యం స్కాంలో తనను కుట్రతో ఇరికించారని చెబుతున్న చెవిరెడ్డికి షాక్ తగిలేలా వెంకటేష్ నాయుడు విడియోలు బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Also Read: https://mega9tv.com/andhara-pradesh/tirupati-hathiramji-mutt-lands-seized-political-shadow-over-mutt-building/