కడప జిల్లాలో ఆ ఊరి పేరు చెప్తే…?!

Spread the love

Pulivendula ZPTC Election: కడప జిల్లాలో ఆ ఊరి పేరు చెప్తేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1978 నుంచి ఇప్పటివరకు పులివెందులలో ఎన్నికలు ఏవైనా గెలుపు ఆ కుటుంబానిదే. వైయస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ హవా కొనసాగిస్తూ వస్తున్నారు. పులివెందులలో ఇంతటి ధీమా ఉన్న వైసీపీ నేతలకు ఇప్పుడు గుబులు పుట్టుకొచ్చిందట. జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం, గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుండడంతో ఇప్పుడు వైసీపీలో ముఖ్య నేతల నుంచి పార్టీ శ్రేణుల వరకు ఉప పోరు గుబులు తప్పడం లేదట. ప్రస్తుత పరిణామాలతో తమ అభ్యర్థి గెలుపు కోసం పడని పాట్లు పడుతున్నారట వైసీపీ నేతలు.

పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక హాట్ హాట్ గా మారింది. టీడీపీ నుంచి ఆ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి బరిలో ఉన్నారు. బీటెక్ రవి ఎమ్మెల్సీగా మాజీ మంత్రి దివంగత వైయస్ వివేకానందరెడ్డితో పోరాడి గెలిచాడు. ప్రస్తుతం పులివెందుల ఇన్చార్జిగా ఉన్న బీటెక్ రవి వ్యూహరచనలో రాజకీయ సామర్థ్యం కలిగిన నేతగా గుర్తింపు ఉంది. అధిష్టానం ఆదేశిస్తే పులివెందులలో తన సతీమణి, లేదా సోదరుని ఎన్నికల బరిలో దింపుతామని చెప్పారు. ఆ మేరకు ఆయన సతీమణి లతా రెడ్డిని టిడిపి అభ్యర్థిగా పోటీకి నామినేషన్ వేయించారు. తెలుగుదేశం పార్టీ పులివెందులలో గెలిచి తీరాలన్న వ్యూహంతో ఉందట.

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సత్తా చాటి జగన్ తన పవర్ ఏంటో చూపించాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర పరాభవం కలిగించే విధంగా వైసీపీ అత్యధిక స్థానాలను గెలిచింది. ఈ పరిణామం పార్టీ అధినేత చంద్ర బాబులో మర్చిపోలేదట. అందుకే ఇప్పుడు పులివెందులలో జడ్పీ ఎన్నికను చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పులివెందులలో గెలిచి తీరాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అక్కడ నాయుకులకు నిర్దిష్టమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారట. ఎప్పుడు లేని విధంగా ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ప్రతి కుటుంబాన్ని అంచనా వేస్తూ గెలుపు కోసం ప్రణాళికను రూపొందించారట. Pulivendula ZPTC Election.

ఇక పులివెందుల జడ్పిటిసి స్థానాన్ని కైవసం చేసుకోవడంలో జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సహకారం కూడా అడిగనట్లు ప్రచారం జరుగుతోంది. మూడు రోజులుగా ఆయన పులివెందులలో స్థానిక నాయకులు, అన్ని పంచాయతీలోని నాయకులతో మాట్లాడుతూ కసరత్తు చేస్తున్నారట. ఆదినారాయణరెడ్డికి పులివెందులలో బంధుత్వాలు ఉండడంతో పాటు పొరుగు నియోజకవర్గం కావడంతో ఆయన ప్రభావం బాగా ఉంటుందని టీడీపీ నమ్ముతోంది. ఇక బీటెక్ రవికి తోడుగా తోడుగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎన్నికలపై ప్రత్యేక దృష్టితో పెట్టారట. వీరి ప్రయత్నాలకు తోడు పార్టీ అధికారంలో ఉండడం కూడా సహకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వైసీపీ నుండి కూడా ఒకరిద్దరి నాయకులను టిడిపిలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పులివెందుల జడ్పీ ఎన్నిక మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read: https://mega9tv.com/andhara-pradesh/srisailam-constituency-politics-tdp-vs-ysrcp/