ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు:ఏపీ ఫ్యాక్ట్ చెక్  

Spread the love

ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.  అనంతపురం జిల్లా, గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవాలయ పునర్ నిర్మాణ కార్యక్రమం సందర్భంగా తీసిన వీడియోలతో ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.  దేవాలయ గర్భాలయం, విమానగోపురం,  అర్థ మండపం డిపార్ట్మెంట్ ప్లాన్, ఎస్టిమేషన్ ప్రకారం రాయచూర్ కు చెందిన శ్రీ ఎస్. రాజేంద్రారెడ్డి, క్లోజ్డ్ మండపం చల్లా అంజనీ ప్రసాద్ (హైదరాబాద్) వారు తమ స్వంత ఖర్చుతో నిర్మాణం చేస్తున్నారని ఇందుకు సంబంధించి రాతి నిర్మాణపు పనులు 60% పూర్తి అయినందున దేవస్థానం వైదిక కమిటి సభ్యుల తీర్మానం, తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమ సలహాదారులు లిఖిత పూర్వక సూచనల మేరకు దేవాదాయ శాఖ కమీషనర్ వారికి నివేదిక రూపంలో తెలియపరచి 28.02.2026 ఉదయం శాస్ట్రోక్తముగా స్థానిక శాసన సభ్యులు, కసాపురం గ్రామస్తులు, డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, డిప్యూటీ స్థపతి, రెవిన్యూ, పోలీస్ వారి సమక్షంలో బాలాలయం ఏర్పాట్లు చేసి అదే రోజు మధ్యాహ్నం పై అధికారుల సమక్షంలో పంచనామా చేసి పాత ఆలయమును తొలగించారని తెలిపింది. 27.06.2026 న ఉత్తరాయణ పుణ్య కాలంలో నూతన దేవాలయ పునః ప్రతిష్ట చేసేందుకు ఆగమ సలహాదారులు, వైదిక సభ్యులు నిర్ణయించారని వివరించింది. వాస్తవాలు ఇలా ఉండగా తప్పుడు ప్రచారం చేయడం, సున్నితమైన మతపరమైన అంశాలలో ఆవేశకావేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేసింది. ఇక దీనిపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతున్నట్లు  చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఫేక్ ప్రచారం చేస్తున్న వైసీపీ పేటియం బ్యాచ్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలని ఎక్స్ లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *