ఏపీ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల 21 మంది విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ఏపీ విద్యా,, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కసి, పట్టుదలే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. సవాళ్లను అధిగమించి ప్రపంచాన్ని జయించాలి. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. విద్యార్థులను అభినందిస్తూ, యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని శుభాకాంక్షలు తెలిపారు.