అమరావతిలో మొదటి  క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ..ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

అమరావతిలో మొదటి  క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ సహా, మేధా టవర్స్‌లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీని సీఎం ప్రారంభించారు. ఈ  కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్, డీఎస్టీ సహా వేర్వేరు క్వాంటం కంపెనీల ప్రతినిధులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ లో క్వాంటం కొత్త చాప్టర్ ఆవిష్కృతమైంది. భారత్ లోనే  మొదటి క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీగా నిలవనుంది.  ఈ రెండు క్వాంటం టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించేలా సదుపాయం ఉండనుంది. ఈ రెండు కంప్యూటర్ల ఆవిష్కరణతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్‌ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ చరిత్ర సృష్టించింది. వీటితో క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్ ను టెస్ట్ చేసి సర్టిఫై చేసే కెపాసిటీని అమరావతి క్వాంటం వ్యాలీ సమకూర్చుకుంది. ఈ రెండు చోట్లా మైనస్ 273 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో పనిచేసే క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ లు ఏర్పాటు కాబడుతున్నాయి. క్వాంటం కంప్యూటర్ ఉపకరణాల తయారు చేసే కంపెనీలు, రీసెర్చర్స్, విద్యార్ధులు, నిపుణులకు ఉపయోగపడేలా క్వాంటం టెస్ట్ బెడ్స్ నిలవనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *