
Subrahmanyan Chandrasekhar Nobel Winner: నక్షత్రాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలను తరచి చూస్తే కోపర్నికస్, గెలీలియో, కెప్లర్, న్యూటన్ లాంటి మహానుభావులు ఎందరో మనకు తారసపడతారు.. వారు వేసిన అడుగుజాడల్లో నడిచి నోబెల్ బహుమతి అందుకున్న మరో శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. ఈయన దక్షిణ భారతదేశానికి చెందినవారు.
1910 అక్టోబర్ 19న నాటి అవిభక్త భారతదేశం పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్ పట్టణంలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర సుబ్రహ్మణ్య అయ్యర్. ఆడిట్ మరియు అకౌంటింగ్ శాఖలో ఉంద్యోగి. తల్లి సీతాలక్ష్మి. చంద్రశేఖర్ కు పన్నెండేళ్ళు వచ్చేవరకు ఇంటి వద్దనే ట్యూషన్ ద్వారా విద్యనభ్యసించారే తప్ప పాఠశాల ప్రవేశం చేయలేదు. అంటే ప్రాథమిక విద్య ఇంటివద్దనే జరిగింది. 1922లో తన 12వ ఏటా హిందూ హైస్కూల్ లో ప్రవేశించారు. స్కూలింగ్, కాలేజీ విద్యను మద్రాస్ లో పూర్తిచేశారు. 1925లో మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్రంలో బ్యాచిలర్ కోర్సులో ప్రవేశించి1930లో డిగ్రీ తీసుకున్నారు.
ఉపకార వేతనంతో ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జ్ లో చదివేందుకు అవకాశం వచ్చింది. 19వ ఏట ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్లిన చంద్రశేఖర్ ఖగోళశాస్త్రానికి సంబంధించి విశేష పరిశోధనలు చేశారు. దీంతో 1933లో చంద్రశేఖర్ పీహెచ్ డీ పూర్తి చేశారు. ఆపై కేంబ్రిడ్జ్ ట్రినిటి కాలేజీ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. 1935లో తన పరిశోధనలను లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ప్రదర్శించి అక్కడి భౌతిక శాస్త్రవేత్తల ప్రశంసలను పొందారు. Subrahmanyan Chandrasekhar Nobel Winner.
1936లో చంద్రశేఖర్ హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లినపుడు రీసెర్చ్ అసోసియేట్ గా చికాగో విశ్వ విద్యాలయంలో చేరారు. అప్పటినుంచి ఆయన అక్కడే స్థిరపడిపోయారు. 1953లో అమెరికా పౌరసత్వం తీసుకోకపోయినా, ఆయనను భారత శాస్త్రవేత్తగా ప్రపంచానికి గర్వంగా చెప్పుకునేవాళ్లం.
చంద్రశేఖర్ తన పరిశోధనల్లో నక్షత్రాలు కూడా మనుషుల్లానే వివిధ దశల ద్వారా పరిణామం చెందుతాయని తెలిపారు. ముఖ్యంగా అరుణ మహాతార, శ్వేత కుబ్జ తార, బృహన్నవ్య తార, న్యూట్రాన్ తార, కృష్ణ బిలం వంటి దశలను ఆయన వివరించారు. ఈ పరిశోధనలకు ఫలితంగానే ఆయనకు 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది.
నక్షత్రాల పరిణామంపై ఆయన చేసిన పరిశోధనల్లో, సూర్యుడు కన్నా 1.44రెట్ల ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలు మాత్రమే శ్వేత కుబ్జ తారలుగా మారతాయని తెలిపిన సిద్ధాంతం చంద్రశేఖర్ లిమిట్ గా ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనిపై ఆధారపడి, అతిపెద్ద నక్షత్రాలు సైతం సూపర్నోవా లేదా బ్లాక్ హోల్గా మారతాయని ఆయన విశ్లేషించారు.
ప్రపంచంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు నోబెల్ బహుమతి పొందడం చాలా అరుదైన విషయం. వారిలో ఒకరు సర్ సి.వి. రామన్ కాగా మరొకరు ఆయన అన్న కొడుకు అయిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. 1995 ఆగస్టు 21న అమెరికాలో ఆయన గుండె సంబంధిత వ్యాధితో మరణించారు.