
CHETABADI శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్‌పై నంద కిషోర్ నిర్మాణంలో నూతన దర్శకుడు సూర్యాస్ రూపొందిస్తున్న చిత్రం ‘చేతబడి’. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ..”చేతబడి అనేది 16వ శతాబ్దంలో మన ఇండియాలో పుట్టిన ఒక కళ. రెండు దేశాలు కొట్టుకోవాలన్నా.. రెండు దేశాలు కలవాలన్నా.. ఒక బలం బలగంతో ఉండాలి. కానీ ఒక ఈవిల్ ఎనర్జీతో మనిషిని కలవకుండా అతన్ని చంపే విద్యే చేతబడి. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. ఇందులో చాలా విభిన్నంగా చూపిస్తున్నాం. మన బాడీలో ప్రతిదానికి ఒక ప్రాణం ఉంటుంది. జుట్టుకు కూడా ఒక ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల ఆధారంగానే ఈ సినిమా ఆధారపడి ఉంటుంది. 1953లో గిరిడ అనే గ్రామంలో రియల్‌గా జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను సిద్ధం చేశాం. సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా థిక్‌గా ఉంటాయి. వర్షం పడినా అవి భూమిలోకి దిగవు. అలాంటి మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇందులో చూపించబోతున్నాం” అని చెప్పారు.
నిర్మాత నందకిషోర్ మాట్లాడుతూ..”ఒకప్పుడు బాణామతి భయం వల్ల రాజకీయ, సామాజిక, మానసిక సమస్యలు తలెత్తాయి. ప్రజల అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా చేసుకున్న వారి గురించి ఈ చేతబడి చిత్రంలో రియలిస్టిక్‌గా చూపించబోతున్నాం” అని అన్నారు. CHETABADI