బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన పెద్ది సినిమాతో రామ్ చరణ్ తన కెరీర్‌లోనే ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అతిపెద్ద సోలో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఆయన చూపించిన నటన, కండలు తిరిగిన దేహం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో చేతికి గాయం కావడం, దానికి శస్త్రచికిత్స జరిగి విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఆర్‌సీ17 కొంత ఆలస్యమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చరణ్ పూర్తిగా కోలుకోవడంతో, ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగించుకున్న సుకుమార్ టీమ్.. దసరా బరిలో సినిమాను అధికారికంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్‌పై అంచనాలు మామూలుగా లేవు. ఈసారి ఒక అద్భుతమైన అర్బన్ బ్యాక్‌డ్రాప్‌తో, పక్కా మోడ్రన్ సినిమాటిక్ స్క్రీన్‌ప్లేతో సుకుమార్ రాబోతున్నారు. రంగస్థలంలో చిట్టిబాబుగా గ్రామీణ యువకుడి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయిన చరణ్‌ను, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈసారి పూర్తి భిన్నమైన అవతారంలో చూపించబోతున్నారు. సుకుమార్ రాసుకున్న ఈ స్టైలిష్ కాన్సెప్ట్ పూర్తిగా ఒక ఆధునిక నగర వాతావరణంలో రూపుదిద్దుకోనుంది. మోడ్రన్ సొసైటీలోని మానవ సంబంధాలు, ఎమోషన్స్‌ను బేస్ చేసుకుని ఒక అద్భుతమైన సినిమాటిక్ స్క్రీన్‌ప్లేను సుకుమార్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ తనను తాను పూర్తిగా మార్చుకోనున్నారు. పెద్ది సినిమాలో ఒక స్పోర్ట్స్ పర్సన్‌గా భారీ కండలతో కనిపించిన ఆయన.. ఆర్‌సీ17 కోసం సుమారు 15 కిలోల బరువు తగ్గి, ఎంతో స్లిమ్‌గా, క్లాసీ లుక్‌లోకి మారనున్నారు. ఈ పవర్‌ఫుల్ మేకోవర్ కోసం ఆయన ఇప్పటికే ప్రత్యేకమైన డైట్, వర్కౌట్స్ ప్రారంభించినట్లు సమాచారం. ఇది చరణ్ కెరీర్‌లోనే అత్యంత ట్రెండీ అండ్ క్లాసీ మేకోవర్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ గట్టిగా జరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. గాయం వల్ల వచ్చిన గ్యాప్‌ను ఇప్పుడు రికవర్ చేసేలా మైత్రీ మూవీ మేకర్స్ పక్కా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. రాబోయే దసరా పండుగను టాలీవుడ్‌కు మరింత స్పెషల్ చేస్తూ.. విజయదశమి రోజున ఆర్‌సీ17 చిత్రాన్ని అత్యంత వైభవంగా, లాంఛనంగా ప్రారంభించాలని నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ సన్నాహాలు చేస్తున్నారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన వెంటనే, నవంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. హైదరాబాద్ , పలు విదేశీ లొకేషన్లలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సుకుమార్ విజన్ కు తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్లు ఇప్పటికే ప్రత్యేకమైన సెట్స్ డిజైన్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.హీరో, డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు.. మరి ఇందులో హీరోయిన్ ఎవరు? సుకుమార్ సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చే దేవిశ్రీ ప్రసాద్ ఈసారి ఉంటారా లేదా? ఈ ప్రశ్నల చుట్టూ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ అర్బన్ డ్రామాలో చరణ్ సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలన్న దానిపై సుకుమార్ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. పాన్ ఇండియా అప్పీల్ కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు, అలాగే కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ల పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.సుకుమార్ చిత్రాలకు ఎప్పుడూ ఆస్థాన సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఉండే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈసారి ఈ కాంబినేషన్‌కు బ్రేక్ పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అర్బన్ స్టైలిష్ కాన్సెప్ట్ కు తగ్గట్టుగా అనిరుధ్ లేదా తమన్ లాంటి మరో ప్రముఖ సంగీత దర్శకుడిని తీసుకునే యోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన దసరా రోజున వచ్చే అవకాశం ఉంది.ఏదేమైనా రంగస్థలం లాంటి ఎపిక్ క్లాసిక్ తర్వాత ఈ కాంబో పునరావృతం అవుతుండటంతో ఆర్‌సీ17పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అటు రామ్ చరణ్ స్లిమ్ లుక్, ఇటు సుకుమార్ మోడ్రన్ టేకింగ్.. ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.