ఒకప్పుడు తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటుడు అల్లరి నరేష్. వరుసగా తన కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కితకితలు విశేషంగా అలరించారు. “అల్లరి” సినిమాతో తెరంగేట్రం చేసి, ఆ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఆయన సినిమా అంటే కనీసం ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనే అభిప్రాయం ఒకప్పుడు బలంగా ఉండేది. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నరేష్, దాదాపు 55కి పైగా సినిమాల్లో నటించారు. అయితే, గత కొన్నేళ్లుగా రొటీన్ కామెడీ చిత్రాలకు భిన్నంగా పలు విభిన్నమైన పాత్రలతో తనలోని మరో నటుడిని బయటపెట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ అనే కామెడీ ఫాంటసీ జానర్ తో రానున్నారు. ఆయన సినిమా అంటే మినిమమ్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే హవా నడిచింది. ఇప్పుడు ఆయన మరోసారి తనకు స్ట్రాంగ్ అయిన కామెడీ జానర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నడు. సరికొత్త ఫాంటసీ కామెడీ చిత్రంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నాడు. “రంభ ఊర్వశి మేనక” పేరుతో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కామెడీతో పాటు విభిన్న పాత్రలతోనూ ఆకట్టుకున్న నరేష్, ఈ సినిమాతో మరోసారి సూపర్ ఎంటర్టైన్మెంట్ అందిస్తాడని సినీ ప్రేక్షకులు ఆశిస్తున్నారు. సినిమా సురభి జంటగా నటించిన ఈ సినిమాని చంద్ర మోహన్ తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్, వెన్నెల కిశోర్, నరేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. బాబూ రెడీ బాబూ.. స్టార్ట్ కెమెరా” అంటూ బోయపాటిని ఇమిటేట్ నరేష్ చేసే సందడితో మొదలైన ట్రైలర్ చివర్లో ‘ఓజీ’లోని పవన్ డైలాగ్ తో పూర్తవుతుంది. ఇక ఈ మధ్యలో అన్ని పాత్రలతో చేస్తున్న కామెడీ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది.
ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ కామెడీ రంభ ఊర్వశి మేనకగా రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా .ఆర్.సింగ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, అజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కామెడీతో పాటు ఒక ఫాంటసీ అంశం ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అల్లరి నరేష్ నుండి ప్రేక్షకులు ఆశించే కామెడీ టైమింగ్, కొత్తదనం ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి, అల్లరి నరేష్ కామెడీతో పాటు కొత్త తరహా కథాంశంతో వస్తున్న ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
అల్లరి నరేష్ సినిమాలు సాధారణంగా కుటుంబ ప్రేక్షకులను, యువతను విశేషంగా ఆకర్షిస్తాయి. ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాంటసీ కామెడీ చిత్రం వినోదాత్మక చిత్రంగా ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తుందని అంచనా వేస్తున్నారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఇది ఒక మంచి ఎంటర్టైనర్గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అల్లరి నరేష్ కామెడీ పాత రోజులను గుర్తుకు తెస్తుందని, అదే సమయంలో కొత్త తరాన్ని కూడా ఆకట్టుకునేలా ఈ సినిమా రూపొందిందని తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది, అల్లరి నరేష్ ఆ స్థానాన్ని మళ్ళీ సుస్థిరం చేసుకునే అవకాశం ఉంది.మరి, ఈ కొత్త ఫాంటసీ కామెడీ చిత్రం నరేష్ కెరీర్లో మరో హిట్ అవుతుందా, లేదా చూడాలి.