తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజుగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఒకప్పుడు నిర్మాతగా ఆయన తీసిన సినిమాలు ట్రెండ్ సెట్ చేసిన బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. తర్వాత దర్శకుడిగా మారి భావోద్వేగాలతో నిండిన కథలను, అందమైన విజువల్స్‌తో చెప్పడంలో తన ప్రత్యేకతను నిరూపించారు. శత్రువు, దేవి, దేవిపుత్రుడు, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వంటి చిత్రాలతో టాప్ నిర్మాతగా కొనసాగారు. ప్రస్తుతం ఆయన ‘అగధ’ అనే పాన్ ఇండియా మిస్టికల్ డివైన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన రచన, దర్శకత్వం లో టెక్నికల్‌గా కూడా ఈ సినిమా చాలా బలంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. Sri Adi Varaha Productions బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు. మిక్కిన్ అరుల్ దేవ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా నాని చమిడిశెట్టి పనిచేస్తున్నారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటర్ గా చేస్తున్నారు. ఎం.ఎస్. రాజు ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది మరింత కొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రాజెక్టుపై మరింత ఆసక్తిని పెంచేసింది.
ఈ సినిమా ప్రమోషన్ కూడా చాలా ప్రత్యేకంగా చేశారు. సాధారణంగా పోస్టర్లు, టీజర్లు విడుదల చేసే బదులు… కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించారు. ఒక వీడియోలో ఇద్దరు దొంగలు ఎం.ఎస్. రాజు ఆఫీసులోకి చొరబడి విలువైన వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడ ఉన్న ఆయన పాత సినిమాల పోస్టర్లను చూసి వారు ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు హిట్ అయిన ఆ సినిమాలను చూసి నవ్వుకుంటూ, ఆనందపడుతూ ఉంటారు. కానీ ఆ సరదా క్రమంగా భయంగా మారుతుంది. ఎందుకంటే అక్కడ ఒక పోస్టర్ వారికి పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. అది ఏ సినిమా పోస్టర్ అని వారికి అర్థం కాకపోవడంతో ఆసక్తి పెరుగుతుంది. ఆ పోస్టర్ దగ్గరికి వెళ్లి చూడగానే: అది ‘ఆగధ’ సినిమాకు సంబంధించినదని తెలుస్తుంది. ఆ క్షణం నుంచే వీడియోలో ఒక మిస్టీరియస్ ఫీల్ మొదలవుతుంది. ఈ చిన్న కాన్సెప్ట్ వీడియోతోనే సినిమా మీద ఒక ప్రత్యేకమైన ఆసక్తిని క్రియేట్ చేశారు.