భారత ప్రధాని మోడీకి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్ కాల్

Spread the love

ప్రపంచ రాజకీయ యవనికపై మరోసారి అగ్రరాజ్యాల మధ్య కీలక చర్చలు ఊపందుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన సుదీర్ఘ సంభాషణ ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ట్రంప్ నుండి ఫోన్ కాల్ వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. నా స్నేహితుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నుండి నాకు ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాలలో మా ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని మేము సమీక్షించాము. అన్ని రంగాలలో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాము. మేము పశ్చిమ ఆసియాలోని పరిస్థితిపై  కూడా చర్చించాము మరియు హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) బహిరంగంగా మరియు సురక్షితంగా ఉంచడం యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించినట్లు ప్రధాని పేర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికాకు భారత్ ఒక నమ్మకమైన మిత్రుడని ఈ ఫోన్ కాల్ ద్వారా మరోసారి రుజువైంది. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి భారత్ తన పూర్తి మద్దతును ప్రకటించింది. ఉద్రిక్తతలను తగ్గించడానికి ఎటువంటి సహకారానికైనా సిద్ధమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. గ్లోబల్ ఆర్డర్‌లో భారత్ పాత్ర ఎంత కీలకమో అమెరికాకు తెలిసొచ్చినట్లు కనిపిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *