ప్రీ బుకింగ్ సేల్స్ లో అదరగొడుతున్న ‘ది ప్యారడైజ్’

Spread the love

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’ సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఓవర్సీస్ లో ఒక రోజు ముందే రిలీజ్ అవుతోంది. ప్రీ బుకింగ్స్ లో ఈ సినిమా అదరగొడుతోంది. నార్త్ అమెరికా అడ్వాన్స్ సేల్స్ లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే లక్ష డాలర్ల మార్క్ ను అందుకుంది. దీన్ని బట్టి ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సోషల్ మీడియాలో భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.  దసరా సినిమా విజయవంతం తరువాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. గత చిత్రానికి మించి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని మలుస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో నాని ‘జడల్’ అనే విభిన్నమైన మాస్ పాత్రలో కనిపిస్తున్నారు. నాని కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రంలో మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాయదు లొహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటి కీర్తి సురేష్ ఏష నాగుల పాటలో దుమ్ముదులిపేశారు.  కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషలలో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. విదేశాల్లోనూ నాని మార్కెట్ విస్తరిస్తుందనడానికి ఈ ప్రీ బుకింగ్స్ సేల్స్ ప్రతిబింబిస్తున్నాయి. ఈ సినిమా విడుదలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాల సరళి మారుతున్న తరుణంలో ది ప్యారడైజ్ మరో మైలురాయిగా నిలవనుంది. ప్రేక్షకులు మరియు అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేయడానికి ముందే సిద్ధమవుతున్నారు. ఈ భారీ ప్రాజెక్టును శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.నాని గత చిత్రాల రికార్డులను ఇది సులభంగా అధిగమిస్తుందనే నమ్మకంతో ట్రేడ్ వర్గాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఓవర్సీస్‌తో పాటు దేశీయ మార్కెట్‌లోనూ భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనిపిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *