మీరంతా ఉండగా..నేను ఎలా ఒంటరివాడిని అవుతాను?

Spread the love

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్త వచ్చినా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. తాజాగా సల్మాన్ ఖాన్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయంశమైంది. ఒంటరితనంపై సల్మాన్ చేసిన పోస్ట్ పై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.  దీనిపై మా సల్మాన్ కి ఏమయ్యింది??? ఏమైనా బాధలో ఉన్నారా? అని నెటిజన్లు అనుకున్నారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవడంతో సల్మాన్ ఖాన్ వివరిస్తూ తాను చేసిన పోస్ట్‌ను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. అది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కాదని స్పష్టంగా తెలిపారు. నేను నా గురించి మాట్లాడలేదు. నా చుట్టూ ఇంత పెద్ద కుటుంబం ఉండగా నేను ఒంటరిగా ఉన్నాను అని ఎందుకు అనుకుంటారు?  నాకు ఎంతో ప్రేమించే స్నేహితులు ఉన్నారు. అంతకంటే ముఖ్యంగా కోట్లాది మంది అభిమానులు నాతో ఉన్నారు. మీ అందరి ప్రేమాభిమానాలు నాకు ఎప్పుడూ బలంగా ఉంటాయి. అలాంటప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకోనని అన్నారు. మీరు అందరూ నన్ను ఇంతగా ఆదరిస్తుంటే నేను ఒంటరిగా ఉన్నాను అని చెబితే అది మీ ప్రేమను అవమానించినట్టే అవుతుంది. నేను కృతజ్ఞత లేని వ్యక్తిని అవుతాను. తాను ఆ ఉద్దేశంతో అనలేదని స్పష్టం చేశారు.  కొన్నిసార్లు మన కోసం మనం కొంచెం సమయం కేటాయించుకోవాలి. మనలో మనం ఉండాలి. అదే నేను చెప్పాను. కానీ దాన్ని పూర్తిగా వేరేలా తీసుకుని బ్రేకింగ్ న్యూస్ చేశారని నవ్వుతూ పేర్కొన్నారు. ఈ విషయంపై తన తల్లి కూడా ‘ఏమైంది నాన్న?’ అని అడిగారని సల్మాన్ చెప్పారు. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘మాతృభూమి’ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనితో పాటు టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి  దర్శకత్వంలో కూడా సల్మాన్ ఖాన్ ఒక భారీ సినిమా చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *