యష్ ‘టాక్సిక్’: పెద్దల కోసమే..!

Spread the love

ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి ‘టాక్సిక్’ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’. కే.జి.ఎఫ్ సినిమాలతో దేశవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకున్న యశ్ ప్రధాన పాత్రలో గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా గురించి యశ్ మాట్లాడుతూ ఇది కేవలం పెద్దవాళ్ల సినిమా అని “పిల్లలు ఈ సినిమా చూడొద్దని పేర్కొన్నారు.  పెద్దల కోసం తీసిన సినిమా మాత్రమే. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాను. పెద్దలకు తప్పొప్పులు తెలుసు. వాళ్లు ఈ సినిమా నుంచి ఏం నేర్చుకోవాలో నిర్ణయించుకుంటారు. జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదనే విచక్షణ పెద్దవారికి  ఉంటుంది. అందుకే వాళ్ల కోసమే చాలా నిజాయతీగా తీసిన సినిమా అని తెలిపారు. ఒక హీరో అయి ఉండి సమాజం పట్ల తనకు ఉన్న బాధ్యతను కూడా చాటుకున్నారని యశ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ‘టాక్సిక్’ సినిమాలో కియారా అద్వానీ ‘నాడియా’ పాత్రలో, నయనతార ‘గంగ’ పాత్రలో, హుమా ఖురేషి ‘ఎలిజబెత్’ పాత్రలో, తారా సుతారియా ‘రెబెక్కా’ పాత్రలో, మరియు రుక్మిణి వసంత్ ‘మెల్లిసా’ పాత్రలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ తారాగణం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. చూడండి, ఈ సినిమా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడింది. అలాగే హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది.గీతూ మోహన్ దాస్ దర్శకత్వం, యష్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. అలాగే యష్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. పెద్దల కోసం తీసిన సినిమా కావడంతో, కంటెంట్ విషయంలో ఎలాంటి రాజీ పడలేదని అర్థమవుతోంది. సినీ పరిశ్రమపై, బాక్సాఫీస్ కలెక్షన్లపై ఎలా ఉంటుందో వేచి చూడాలి. ‘టాక్సిక్’ విజయం యష్ స్టార్‌డమ్‌ను మరింత పెంచుతుంది. అలాగే గీతూ మోహన్ దాస్ దర్శకత్వ ప్రతిభను దేశవ్యాప్తంగా చాటిచెబుతుంది. ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఇది భారతీయ సినిమాకు కొత్త ట్రెండ్‌ను సృష్టించే అవకాశం ఉంది. పెద్దల కోసం మాత్రమే తీసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించగలవని నిరూపించవచ్చు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *