ఫీల్డ్ ఆపరేషన్ తో అదరగొట్టిన మల్కాజిగిరి సీపీ సుమతి

Spread the love

తన ఫీల్డ్ ఆపరేషన్ తో గడగడలాడించిన సీనియర్ ఐపీఎస్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలను తొక్కిపెట్టేందుకు ఒక సాధారణ మహిళగా ఆమె చేసిన రహస్య ఆపేరషన్ కు ప్రజల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటీవల ఆమె చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా అర్ధరాత్రి రోడ్డుపై నిలబడిన ఆమెను దాదాపు 40 మంది పోకిరీలు వేధింపులను ప్రత్యక్షంగా చూశారు.  వారందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఆమె  ఇలా ఫీల్డ్ ఆపరేషన్లు చేపట్టడం ఇదే మొదటి సారి కాదు. ఆమె ఇదివరకు కూడా  ఇలాగే సీక్రెట్ ఆపేరషన్లు చేపట్టి అమ్మాయిల అక్రమ రవాణా, వేధింపులకు గురి చేస్తున్న వారిని అక్కడికక్కడే  పట్టుకున్నారు. 2004 సమయంలో హైదరాబాద్ కూకట్‌పల్లిలో అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి  దింపుతున్న ఓ గ్యాంగ్ పని పట్టారు. ఆ రోజు ఆ ముఠాను పట్టుకున్నారనే విషయాలను ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అమ్మాయిలతో ట్రాఫికింగ్ చేస్తున్నారన్న సమాచారంతో అప్పట్లో ఓ స్టింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు.  వాళ్లను చాలా తెలివిగా నమ్మించి అమ్మాయిలను సఫ్లయ్ చేసే ఆర్గనైజర్లు, ఆ ముఠా సభ్యులను పట్టుకున్న తీరును వివరించారు. ఏ మాత్రం తేడా వచ్చినా వేరే విధంగా ఉండేదని అయితే తన దగ్గర వెపన్ ఉండటమే  ధైర్యమని పేర్కొన్నారు. అమ్మాయిలు ఏ సమయంలోనైనా ధైర్యంగా ఉండాలని మనల్ని మనం కాపాడుకునేందుకు ప్రయత్నించాలన్నారు.  కాలేజీలో చుదువుకునే సమయంలో ఆమె  కూడా చాలా సార్లు వేధింపులకు గురయ్యానని అయితే ధైర్యంగా ముందుడుగా వేయాలన్నారు.  తల్లిదండ్రులు కూడా అమ్మాయిల్లో ధైర్యాన్ని నూరిపోయాలని  సీపీ సుమతి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *