దేశ రక్షణ కోసం పశ్చిమ బెంగాల్ చారిత్రాత్మక అడుగు..కేంద్రం చేతుల్లోకి ‘సిలిగురి కారిడార్’

Spread the love

దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. తాజాగా రక్షణకు సంబంధించి అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ కు రక్షణా పరంగా వ్యూహాత్మకంగా కీలకమైన  సిలిగురి కారిడార్’… దీనినే ‘చికెన్ నెక్’ అని కూడా పిలుస్తారు. పశ్చిమ బెంగాల్‌ను ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాలతో కలిపే  ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలకు ఉపక్రమించింది.  పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి తీసుకున్న ఒక సంచలన నిర్ణయం… ఇప్పుడు శత్రుదేశాల గుండెల్లో గుబులు రేపుతోంది. భారతదేశ భూభాగ రక్షణ పటంలో సిలిగురి కారిడార్ లేదా చికెన్ నెక్ అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. దేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కనెక్ట్ చేసే ‘చికెన్ నెక్’ ప్రాంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేస్తూ ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న 120 ఎకరాల భూమిని నేరుగా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో పాటు ఆ పరిధిలోని నేషనల్ హైవేలు  కూడా ఇకపై బీఎస్ఎఫ్ కంట్రోల్ లోకి వెళ్లనున్నాయి. ఈ కీలక నిర్ణయంతో ఇరవై రెండు కిలోమీటర్ల సున్నితమైన బోర్డర్ ఏరియాపై కేంద్రానికి పూర్తి పట్టు లభించనుంది. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ తో సరిహద్దు వివాదాలు, చొరబాట్లను అడ్డుకోవడమే  లక్ష్యంగా ఈ అడుగు పడింది. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది. అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతంలో ఇకపై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్  నిరంతర నిఘా కొనసాగిస్తుంది. ఇటు బెంగాల్‌తో పాటు అటు ఈశాన్య రాష్ట్రాల రక్షణకు ఈ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ ఒక బలమైన షీల్డ్ లాగా మారనుంది. చికెన్ నెక్ గా పిలిచే ఈ సన్నని మార్గంపై ఎప్పుడూ అంతర్జాతీయ దృష్టి ఉంటుంది. తాజాగా బెంగాల్ సీఎం  సువేందు అధికారి  తీసుకున్న నిర్ణయం కీలకంగా మారనుంది. అక్కడి 120 ఎకరాల భూభాగంతో పాటు కీలక రవాణా మార్గాలను బీ.ఎస్.ఎఫ్ కు  బదిలీ చేశారు. ఈ 22  కిలోమీటర్ల సున్నితమైన కారిడార్‌పై కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు లభించడం దేశ భద్రతను మరింత పటిష్టం చేయనుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో పటిష్ట  నిఘా అవసరమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. స్థానిక రాజకీయ వ్యూహాల కంటే దేశ భద్రతకే సీఎం సువెందు ప్రాధాన్యత ఇచ్చారు.  బీఎస్ఎఫ్ చేతుల్లోకి ఈ ప్రాంతం వెళ్లడం ద్వారా చొరబాట్లకు, అక్రమ రవాణాకు శాశ్వతంగా అడ్డుకట్ట పడనుంది.  సరిహద్దు ప్రాంతాల అంశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం ఉంటే దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా వెనక్కి తగ్గేది లేదని అనడానికి  ఇదొక మంచి ఉదాహరణ. రానున్న రోజుల్లో  ఈ కారిడార్ నుండి జరిగే రవాణా ,  రక్షణ వ్యూహాలు పూర్తిగా మారనున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా పొంచి ఉన్న ముప్పుకు తాజా నిర్ణయంతో చెక్ పెట్టినట్లయింది. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ పూర్తి పట్టు దక్కడం రక్షణా పరంగా భారత్ కు కలిసొచ్చే అంశం.  ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుండి వేరు చేయాలని చూసే దుష్టశక్తుల ఆటలు ఇక సాగవు. ఈ నిర్ణయంతో అటువంటి శక్తులకు గట్టి దెబ్బ తగిలింది. సరిహద్దుల్లో అలజడి సృష్టించాలనుకునే ఈ శక్తులకు ఇకపై భారత రక్షణా దళాలే సరైన సమాధానం చెబుతాయి.  సువేందు అధికారి దేశ క్షేమం కోసం  అక్కడ ఉన్న భూమిని రక్షణ అవసరాల కోసం బీఎస్ఎఫ్‌కు బదిలీ చేశారు. బంగ్లాదేశ్‌తో సుదీర్ఘ సరిహద్దు ఉన్నందున  జోన్ ఎల్లప్పుడూ అత్యంత అలెర్ట్ గా ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకున్న ఈ నిర్ణయం దేశ ప్రజల్లో సరికొత్త భరోసాను నింపింది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూ బదిలీ ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది. అక్రమ చొరబాటు వ్యూహాలను తిప్పికొట్టేందుకు సరిహద్దు రక్షణ దళానికి ఇది పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *