మళ్లీ రంగంలోకి కాక్రోచ్ జనతా పార్టీ..సెప్టెంబర్ 5న ఢిల్లీలో బిగ్ ర్యాలీ

Spread the love

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయంశమైందో తెలిసిందే.  NEET 2026 పేపర్ లీక్, CBSE ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలో అవకతవకల ఆరోపణలపై పార్టీ ఆందోళన చేపట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది అప్పటి ప్రధాన డిమాండ్. ఆ నిరసనకు విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు.  జూలై 20న పార్లమెంట్ వైపు మార్చ్‌కు ప్రయత్నించిన సమయంలో పోలీసులతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపైనా CJP తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనంతరం  ప్రభుత్వం, నిరసనకారుల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి.FIRల ఉపసంహరణ, నిర్బంధించిన వారిని విడుదల చేయడం వంటి అంశాలపై హామీలు లభించాయని CJP తెలిపింది. అయితే ఇప్పుడు ఆ హామీల అమలుపై పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అందుకే మరో ర్యాలీకి పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 5 ర్యాలీనిర్వహించనుంది. ఇచ్చిన హామీలను అమలు చేయాలని CJP కోరుతోంది. మరోవైపు ఈ ఉద్యమం కేవలం NEET అంశానికే పరిమితం కాకుండా యువత సమస్యలపై విస్తరిస్తోంది. యువ నిరసనకారుల హక్కులు, పోలీసు చర్యలు, విద్యా వ్యవస్థలో పారదర్శకత వంటి అంశాలు కూడా చర్చలోకి వస్తున్నాయి. దీంతో సెప్టెంబర్ ర్యాలీ గత ఉద్యమాలకు కొనసాగింపుగా మారబోతోంది.

సెప్టెంబర్ 5న జరగబోయే నిరసనకు ఇండియా గేట్‌ ను ప్రారంభ వేదికగా CJP ఎంచుకుంది. అక్కడి నుండి న్యూఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు శాంతియుత మార్చ్ నిర్వహించనుంది. ఈ మార్గం ద్వారా తమ డిమాండ్లను నేరుగా పోలీసు వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది.నిరసనకు NEET బాధిత విద్యార్థుల కుటుంబాలు నాయకత్వం వహిస్తాయని CJP తెలిపింది. జూలై 25న ఇచ్చిన హామీలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని CJP డిమాండ్ చేస్తోంది. సెప్టెంబర్ 5న ర్యాలీ ఎంతవరకు ప్రశాంతంగా కొనసాగుతుందన్నదీ ఇప్పుడు చర్చనీయాంశం. ఢిల్లీ పోలీసులు అనుమతులు, భద్రతా ఏర్పాట్లు ఎలా చేస్తారన్నది కూడా కీలకం. ర్యాలీకి లభించే ప్రజా స్పందన CJP తదుపరి రాజకీయ వ్యూహంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.కాక్రోచ్ జనతా పార్టీ తన ఉద్యమాన్ని విద్యా వ్యవస్థలోని ఇతర సమస్యల వైపుకూ తీసుకెళ్తోంది.దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలనే కార్యక్రమానికి ఇప్పటికే పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులను పరిశీలించడం, సమస్యలను వెలుగులోకి తీసుకురావడం వంటి కార్యక్రమాలు చేపడుతోంది. ఇది పార్టీ ఉద్యమ పరిధిని విస్తరించే వ్యూహంగా కనిపిస్తోంది. విద్యా రంగంపై నిరంతర ఒత్తిడి పెంచడం ద్వారా ప్రజల్లో తమకు మద్దతు పెంచుకోవాలని CJP భావిస్తోంది. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ఇప్పుడు మరింత దృష్టి పడుతోంది. అయితే ఈ క్యాంపెయిన్ ఎంతవరకు రాజకీయ ప్రభావాన్ని చూపుతుందన్నది భవిష్యత్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం విద్య, యువత, నిరసనల అంశాలను కలుపుతూ CJP తన ఉద్యమాన్ని విస్తరిస్తోంది.సెప్టెంబర్ 5న జరగనున్న ఆందోళనతో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఒత్తిడి పెంచాలని కాక్రోచ్ జనతా పార్టీ భావిస్తోంది. యువతకు ఇచ్చిన హామీల అమలుపైనే ఈసారి ప్రధానంగా ప్రశ్నలు సంధించనుంది.NEET విద్యార్థుల కుటుంబాలను ముందుకు తీసుకురావడం ద్వారా సమస్య తీవ్రతను చాటిచెప్పాలని చూస్తోంది.జూలైలో జరిగిన పరిణామాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాలని పార్టీ డిమాండ్ చేస్తోంది.పోలీసుల చర్యలపై కూడా స్పష్టత రావాలని కోరుతోంది. కేంద్రం ఈ నిరసనకు ఎలా స్పందిస్తుందన్నదీ ఆసక్తికరంగా మారింది.ర్యాలీని శాంతియుతంగా నిర్వహిస్తామని CJP చెబుతున్నప్పటికీ పోలీసుల అనుమతులు, భద్రతా ఏర్పాట్లు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి.బాధిత కుటుంబాల గళం నేరుగా ప్రభుత్వానికి చేరేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.విద్యా రంగంలో సంస్కరణలతో పాటు యువత సమస్యలపై కూడా పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *