ఫుట్ బాల్ లెజెండ్ మెస్సీ తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్

Spread the love

ఫుట్ బాల్ ఆటలో మెస్సీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ తరం ఆటగాళ్లలో లెజెండ్ అతను. ఇక ఇటీవల ఆయన తండ్రి తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఫుట్ బాల్ లో మెస్సీ ఈ స్థాయికి చేరుకోవడంలో తన తండ్రి పాత్ర కీలకం. కాగా, మెస్సీ తన తండ్రి మరణంపై ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. దీంతో ఆటకు గుడ్ బై చెప్పేస్తాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. “నాన్నా, నువ్వు ఇక లేవు అనే విషయాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది నా మనసుకు పట్టడం లేదు. లేదా నేను ఈ విషయాన్ని నమ్మడానికి ఇష్టపడట్లేదేమో. నేను నిన్ను ఇక ఎప్పటికీ చూడలేను, మనం ఇక ఎప్పటికీ మాట్లాడుకోలేము అని ఊహించుకోవడం కూడా నాకు చాలా కష్టంగా ఉంది. నువ్వు అనుభవించిన బాధ నాకు తెలుసు, నీకిది విశ్రాంతినిచ్చే మంచే అయి ఉండవచ్చు, కానీ నువ్వు చాలా త్వరగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు. మనం కలిసి సంతోషంగా గడపడానికి ఇంకా ఎంతో సమయం మిగిలి ఉండింది.చివరిగా మరొక్క ప్రపంచకప్ ఆడమని నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు, సరిగ్గా టోర్నమెంట్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే నీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఒక టోర్నమెంట్‌లో నువ్వు నాతో లేకపోవడం ఇదే మొదటిసారి. కానీ నువ్వు కోలుకుంటావని, ప్రయాణం చేసేంత ఆరోగ్యం నీకు వస్తుందని అమ్మ నాకు చెప్తూనే ఉండేది. నువ్వు ప్రయాణించి రావడం కోసం మనం ఎలాగైనా ఫైనల్‌కు చేరుకుంటామని నేను నీకు చెప్తూనే ఉన్నాను. ప్రతి మ్యాచ్ పూర్తయిన తర్వాత, నేను నీ మెసేజ్ కోసం వేచి చూసేవాడిని, ఆ సందేశం రాకపోయేసరికి నిన్ను తీవ్రంగా మిస్సయ్యేవాడిని. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అప్పుడే నాకు అర్థమైంది. అయినప్పటికీ, నీకు మరికొంత సమయం ఇవ్వాలని, నువ్వు వచ్చి ఒక మ్యాచ్ అయినా చూడగలవని సాధ్యమైనంత దూరం టోర్నమెంట్‌లో ముందుకు వెళ్లాలనే ఆలోచనను నేను ఆపలేకపోయాను. మనం ఫైనల్‌కు చేరుకున్నాం, కానీ మీరు అక్కడ లేరు. ఇలా మెస్సీ భావోద్వేగంతో పోస్ట్ చేశారు. ప్రపంచ ఫుట్ బాల్ అభిమానులు మాత్రం మెస్సీ మరికొన్నేళ్లు ఫుట్ బాల్ ఆడాలనే కోరుకుంటున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *