ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్ లో భారత క్రికెటర్లు ముగ్గురు టాప్-5లో నిలిచారు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ నెంబర్ వన్ ప్లేస్ లో నిలవగా..విరాట్ కోహ్లీ రెండో స్థానంలో, రోహిత్ శర్మ 4వ స్థానంలో భారత వన్డే కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 5వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఈ ఫార్మాట్ లో కుల్ దీప్ యాదవ్ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమ్ ర్యాంకింగ్స్ లో చూసుకుంటే టెస్టుల్లో భారత్ 4వ స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా,సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ లు మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు వన్డే, టీ 20 రెండు ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. టీ 20 ర్యాంకింగ్స్ లో బౌలింగ్ లో భారత పేసర్ బుమ్రా టాప్-5లోకి దూసుకొచ్చాడు. భారత్ నుండి వరుణ్ చక్రవర్తి నెంబర్ 2లో కొనసాగుతున్నాడు. రషీద్ ఖాన్ నెంబర్ వన్ గా ఉన్నాడు. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లు నెంబర్ వన్, నెంబర్ 2గా కొనసాగుతున్నారు. ఆల్ రౌండర్లలో జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, భారత ఆటగాడు హార్దిక్ పాండ్య వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.