చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు..కర్ణాటక ప్రభుత్వం పర్మిషన్

Spread the love

గతేడాది ఎట్టకేలకు మొట్ట మొదటి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న సందర్భంగా ఆర్సీబీ టైటిల్ సెలబ్రేషన్స్ లో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఆ దుర్ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లు జరపడంపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే తాజాగా మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కానున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో 2026 ఐపీఎల్ మ్యాచ్ల ను నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం పర్మిషన్  ఇచ్చింది. ఐపీఎల్ ఈ నెల 28న ఆరంభం కానుంది. చిన్నస్వామి హోస్ట్ చేసే ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.  కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం అక్కడ ఐపీఎల్ నిర్వహణకు అనుమతి లభించింది. ఐపీఎల్ బిగినింగ్ కూడా బెంగళూరులో జరగనుంది. తన ఏడు మ్యాచ్ల్లో అయిదింటిని చిన్నస్వామిలో, రెండింటిని రాయ్ పూర్ లో ఆడనున్నట్లు ఆర్సీబీ ఇంతకుముందు ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *