నేటి నుండి బిగ్గెస్ట్ ఎంటర్టైనింగ్ టీ 20 క్రికెట్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఒక కీలక విషయాన్ని వెల్లడించింది. దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటి రెండు వారాల ఐపీఎల్ మ్యాచ్ లకు దూరం కానున్నట్లు పేర్కొంది. ఎం.ఎస్. ధోనీ ప్రస్తుతం పిక్క కండరాల గాయం (calf strain) నుండి కోలుకోవడానికి చికిత్స పొందుతున్నారు. దీని ఫలితంగా, ఆయన టాటా ఐపీఎల్ (TATA IPL) 2026 మొదటి రెండు వారాల మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. త్వరగా కోలుకోండి, తలా! అంటూ ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. ఇక ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ నేడు బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రారంభ మ్యాచ్ లో తలపడనున్నాయి. సీజన్ ను ఘనంగా ఆరంభించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. రెండు హోరాహోరీగా పోరాడనున్నాయి. ఇక రెండు నెలల పాటు క్రికెట్ ప్రేమికులకు మంచి వినోదం లభించనుంది.